రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారి మండలి సమావేశాలు ఈ రోజు ఉదయం 8:30 నిమిషాలకు భోపాల్ లోని సరస్వతి శిశుమందిర్ ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి.
పూజనీయ సరసంఘచాలక్ మరియు మాననీయ సర్ కార్యవాహ భారత మాత విగ్రహానికి పుష్పమాలను అర్పించడం తో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు 14 అక్టోబర్ సాయంత్రం వరకు జరుగుతాయి. ఇందులో అఖిల భారతీయ కార్యకారిణి, క్షేత్ర కార్యవాహలు, క్షేత్ర ప్రచారక్ లు, ప్రాంత సంఘచాలక్ లు, కార్యవాహలు, ప్రాంత ప్రచారక్ లు పాల్గొంటారు.
ఈ సమావేశాల గురించి సహ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలె పత్రిక విలేఖరులకు వివరిస్తూ సమావేశాలలో సంఘ కార్య విస్తరణ, దృఢీకరణ మరియు వచ్చే మూడు సంవత్సరాలలో చేపట్టే కార్యక్రమాల ప్రణాళిక గురించి చర్చించడం జరుగుతుందన్నారు.
సంఘ్ చేపట్టిన పరివార్ ప్రభోధన్, సామజిక సమరసత, గ్రామ వికాసం తో పాటు వివిధ కార్యక్రమాల పట్ల సానుకూలమైన స్పందన వస్తోందని, వీటి గురించి కూడా సమావేశాలలో చర్చిస్తారని ఆయన వెల్లడించారు.
గత సంవత్సరంతో పోలిస్తే 1600 కొత్త శాఖలు మరియు 1700 సాప్తహిక్ మిలన్ లు పెరిగాయని, యువకులు పెద్ద సంఖ్యలో సంఘ కార్యంలో పాలుపంచుకునేందుకు ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు.
ఈ సమావేశాలలో దేశం మొత్తం నుండి దాదాపు 350 మంది కార్యకర్తలు పాల్గొంటున్నారు.