Home News ఆర్ఎస్ఎస్ జ్యేష్ట ప్రచారక్ మహావీర్ జీ అస్తమయం

ఆర్ఎస్ఎస్ జ్యేష్ట ప్రచారక్ మహావీర్ జీ అస్తమయం

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జ్యేష్ట ప్రచారక్, భారతీయ కార్యకారిణి మండలి సభ్యులు మహావీర్ జీ గుండెపోటు మూలంగా 24 అక్టోబర్, 2017 చండీగఢ్ లో స్వర్గస్థులయ్యారు. చండీగఢ్ సంఘ కార్యాలయంలో ఆయన పార్థివశరీరాన్ని దర్శించుకున్న వేలాదిమంది స్వయంసేవకులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

 

మహావీర్ జీ పంజాబ్ లోని బుతలాడ్ జిల్లా మానసా లో 22 నవంబర్, 1951 జన్మించారు. ఆయన తల్లిగారు కృష్ణాదేవి, తండ్రిగారి పేరు దివాన్ చంద్. ఆయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. మహావీర్ జీ చిన్నప్పటి నుండి స్వయంసేవక్. 1950లో బుతలాడ్ కు రావడానికి ముందు వీరి కుటుంబం పాకిస్తాన్ లో నివసించేది. వీరి తండ్రి పాకిస్తాన్ లోనే శాఖకు వెళుతుండేవారు. అక్కడ వారికి సంఘ బాధ్యత కూడా ఉండేది. బుతలాడ్ వచ్చిన తరువాత ఆయన నగర కార్యకర్తగా ఉండేవారు. మహావీర్ జీ సంఘ ప్రవేశం ఇక్కడే జరిగింది. సీనియర్ సెకెండరి వరకు ఆయన చదువు మానసలోనే జరిగింది. మొగాలో బీఎస్సీ పూర్తిచేసిన తరువాత చండీగఢ్ లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి స్టాటస్టిక్స్ లో ఎమ్మెస్సీ పూర్తిచేశారు. ఆయనది చాలా కుశాగ్ర బుద్ధి. అమోఘమైన జ్ఞాపక శక్తి. ఎమ్మెస్సీ పూర్తిచేసిన తరువాత ప్రచారక్ గా సంఘ కార్యం చేయాలని నిర్ణయించుకుని జీవితాంతం అలాగే ఉన్నారు. ఆయన చాలా కష్టపడి పనిచేసేవారు. ఎంతో నియమబద్దమైన దినచర్య వారిది. సమయాన్ని సదుపయోగం చేయడం వారికి బాగా తెలుసు. హిమాచల్ ప్రదేశ్ లో సంఘ కార్యవ్యాప్తి వెనుక వారి కఠోర పరిశ్రమ ఉంది. మండి, సిమ్లాల్లో జిల్లా ప్రచారక్, కాంగ్ ధా విభాగ్ ప్రచారక్, హిమగిరి ప్రాంత (హిమాచల్ మరియు జమ్మూకాశ్మీర్ ) సహ ప్రాంత ప్రచారక్ గా పనిచేశారు. ఆ తరువాత పంజాబ్ ప్రాంత ప్రచారక్ గా, ఉత్తర క్షేత్ర ప్రచారక్ ప్రముఖ్, అఖిలభారతీయ సహ బౌద్ధిక్ ప్రముఖ్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

 

కుశల సంఘటకులు, మృదు భాషి, వేలాదిమంది స్వయంసేవకులకు స్ఫూర్తిని అందించిన మహావీర్ జీ మరణం తీరని లోటు. సంఘ ఒక ఆదర్శ స్వయంసేవక్ , అనుశాసిత కార్యకర్తను కోల్పోయింది. ఆయన జీవితం కార్యకర్తలకు ఎప్పుడు స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటుంది. ఆయన ఆత్మకు భగవంతుడి శాంతి చేకూర్చాలి.

 

24 అక్టోబర్ ఢిల్లీ నుండి చండీగడ్ వస్తున్నప్పుడు మహావీర్ జీ అనారోగ్యానికి గురయ్యారు. చండీగఢ్ లోని పి జి ఐ లో 2గం. 15ని. గుండెపోటువల్ల ఆయన మరణించారు.

 

శోక సందేశం పంపేందుకు చిరునామా

సూరజ్ ఛావ్డా (మొబైల్ . 94174-28632)

చిరునామా – వాటర్ వర్క్స్ రోడ్, డి ఏ వి స్కూల్ , మానసా – 151505, పంజాబ్