Home News అఖండ సాంస్కృతిక భారత్ కు ‘గురునానక్’ మార్గదర్శి – సురేష్ జీ జోషి

అఖండ సాంస్కృతిక భారత్ కు ‘గురునానక్’ మార్గదర్శి – సురేష్ జీ జోషి

0
SHARE
Suresh Bhayya ji Joshi

రానున్న రోజుల్లో విశ్వవ్యాప్తం కానున్న అఖండ సాంస్కృతిక భారత దేశానికి “గురునానక్ గోవింద్ సింగ్” మార్గదర్శనం కారణం అవుతుందని ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ సురేష్ భయ్యా జీ జోషి ఉద్గాటించారు.

శనివారం కార్తిక మాసమ పౌర్ణమి రోజున గురునానక్ గోవింద్ సింగ్ జయంతిని పురస్కరించుకొని అయన కరీంనగర్ లోని గురుద్వారాను సందర్శించుకొని ప్రత్యేక ప్రార్ధనలు చేసారు.

ఈ సందర్బంగా గురునానక్ భక్తులు, కరీంనగర్ పుర ప్రజలను ఉద్దేశించి భయ్యా జీ జోషి మాట్లాడుతూ ధర్మం, జాతీయత ఆధారంగా జీవించే ప్రజా సమూహం అంత ఒక దేశంలాగా నిర్మాణం కావాలన్నారు. ప్రపంచానికి జీవన ప్రమాణాలను, విధానాలను అందించిన సాంస్కృతిక  వైభవం భారత ప్రత్యేకత అని అన్నారు. నాడు గురునానక్ ప్రారంబించిన “ఖాల్సాపంథా” హైందవ రాజ్య నిర్మాణానికి బాటలు కావాలని పిలుపునిచ్చారు. “ఖాల్సాపంథా”ను ఆదర్శ భావాలుగా స్వీకరించి దేశ రక్షణకు, హైందవ సంస్కృతి రక్షణకు యావత్తు దేశ ప్రజలు కంకణబద్దులు కావాలని కోరారు.

నేడు సమాజంలో కొనసాగుతున్న వివక్ష, అంటరానితనం, పేదరికం లాంటి వాటి నిర్మూలనకు జాతీయత ఆధారంగా ప్రత్యేక కార్యాచరణ నిర్మించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. గత వేల సంవత్సరాలుగా వస్తున్న పరంపర మౌలిక నైతక విలువలతో కూడిన చట్టాలు రూపొందాలని ఆకాక్షించారు. సామాన్య పౌరులను దృష్టిలో పెట్టుకొని ఆర్ధిక, సామజిక చట్టాలను, విద్యా విధానాన్ని రూపొందించేందుకు జాతీయవాదులు అయిన మేధావులు, పాలకులు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.

గురుద్వారాను సందర్శించిన అనంతరం స్థానికులతో కలిసి సాముహిక అల్పాహారం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సురేష్ భయ్యాజి జోషి వెంట ఆర్.ఎస్.ఎస్ కరీంనగర్ నగర సంఘచాలక్ డా. చక్త్రవర్తుల రమణాచారి, గురుద్వారా నిర్వాహకులు సర్దార్ జగ్బిర్ సింగ్, సర్దార్ మంజీత్ సింగ్, సర్దార్ జస్వంత్ సింగ్, కార్పొరేటర్ సోహన్ సింగ్, కొట్టే మురళీకృష్ణ, జీతి మహేందర్ రెడ్డి, బోయినపల్లి ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి, కచ్చు రవి తదితరులు పాల్గొన్నారు.