Home News భద్రాద్రి లో క్రైస్తవ ప్రార్ధనలను అడ్డుకున్న పురోహితులు, స్థానికులు

భద్రాద్రి లో క్రైస్తవ ప్రార్ధనలను అడ్డుకున్న పురోహితులు, స్థానికులు

0
SHARE

పవిత్ర పుణ్య క్షేత్రమైన భద్రాచలం లో అన్యమత ప్రచారం జోరుగా సాగుతోంది. దక్షిణ భారత దేశంలో అతి ప్రసిద్ద పుణ్య క్షేత్రంగా భాసిల్లుతున్న భద్రాచలం రామాలయం సమీపం లోనే అన్యమత ప్రచారం జరుగుతుండడం విశేషం.

రామాలయం సమీపంలో గోదావరి కరకట్ట వద్ద శుక్రవారం దుమ్ముగూడెం మండల తూరుబాక గ్రామానికి చెందిన పాస్టర్ ఒకరు, అతని అనుచరులు క్రైస్తవ ప్రార్ధనలు చేస్తూ కరపత్రాలు పంచుతూ సంచలనం రేపారు. ఇది గమనించిన కొందరు పురోహితులు, స్తానికులు వారిని నిలదీయడం తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

తొలిత పాస్టర్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. విహార యాత్రకు వచ్చామని చెప్పి వెళ్ళిపోయే ప్రయత్నం చేయగా అతని వద్ద కర పత్రలను  పురోహితులు గమనించి గట్టిగా నిలదీశారు. దీంతో సదురు పాస్టర్ ప్రార్ధనలు చేయడానికి ఇక్కడికి వచ్చామని చెప్పడం తో పురోహితులు ఆగ్రహించారు. హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీ రాముడు నడియాడిన ప్రాంతంలో అన్యమత ప్రచార చేయడం విరుద్ధమైన ఎందుకు ఇలా చేస్తున్నారంటూ ప్రశ్నించారు. పాస్టర్లు బిత్తర పోవడం తో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి సదురు పాస్టర్, అతని అనుచరులు జారుకున్నారు.

కాగ గతంలో రామాలయం వద్ద ప్రహారిలపై అన్యమత ప్రచారం చేస్తూ కొందరు గోడ పత్రికలను అంటించారు. పలుమార్లు రామాలయం సమీపంలో భక్తులకు క్రైస్తవ బోధనలు చేస్తూ పట్టు బడ్డారు . అన్యమత ప్రచారం నేరమైన కఠిన చర్యలు తీసుకోకపోవడం తోనే సర్వ సాధారణంగా మారిందని భక్తులు మండిపడుతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన అన్యమత ప్రచారం తో కలుషితం చేసేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని విశ్వా హిందూ పరిషత్ ప్రతినిధులు ధ్వజమెత్తుతున్నారు. భద్రాద్రి లో అన్యమత నిషేధం పై ఆంక్షలు ఉన్నా కొందరు ఇష్టానుసారం ఈ తంతును కొంత కాలంగా యదేచ్చగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టి భవిషత్తు లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)