Tag: నారద జయంతి
పాత్రికేయుల ద్వారా సమాజ మార్పు సాధ్యం
పాత్రికేయుల ద్వారా సమాజ మార్పు సాధ్యం
నారద జయంతి కార్యక్రమంలో భారత్ టుడే టీవీ చీఫ్ ఎడిటర్ శ్రీ జి. వల్లీశ్వర్
వృత్తి నిబద్దతతో,ఆత్మ విశ్వాసంతో పనిచేసే పాత్రికేయుల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యపడుతుందని భారత్ టుడే టీవీ చీఫ్ ఎడిటర్, ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక పూర్వ సంపాదకులు జి. వల్లీశ్వర్ అన్నారు.
నారద జయంతిని పురస్కరించుకొని సమాచార భారతి, వరంగల్ శాఖ, మంగళవారం ఉదయం సామాజగన్మోహన్ రెడ్డి స్మారక భవనంలో ప్రపంచ పాత్రికేయ దినోత్సవము నిర్వహించింది.
ఈ సందర్భంగా పత్రికా రంగంలో విశేష సేవలందిస్తోన్న నలుగురు పాత్రికేయులను సన్మానించింది. సమాచారభారతి,తెలంగాణ కార్యదర్శి శ్రీ నడింపల్లి ఆయుష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న శ్రీ జి.వల్లీశ్వర్ మాట్లాడుతూ నేటి తరం జర్నలిస్ట్ లు నారద మహర్షి లాగే అన్ని రంగాలలో నిష్ణాతులన్నారు.
సమాజ సంక్షేమం కోసం నేటి జర్నలిస్ట్ లు తమ వార్తల ద్వారా ఎలాంటి పాత్రను పోషిస్తున్నారో అదే పాత్రను నారదమహర్షి నిర్వహించారన్నారు. లోక కళ్యాణం కోసం సమాచార రంగాన్ని జర్నలిస్ట్ లు ఏవిధంగా ఉపయోగించుకుంటున్నారో ధర్మసంరక్షణార్ధం ఆరోజు నారదుడు ముల్లోకాలు తిరుగుతూ కృషి చేశాడన్నారు.పూర్వకాలంలో చక్కటి సమాచార వ్యవస్థను నిర్మాణం చేసిన ఘనత దేవర్షి నారదుడిదేనన్నారు.
సమాచార భారతి ఆయనను తొలి ఆదర్శపాత్రికేయుడిగా గుర్తించి ప్రతియేటా ఆయన జయంతి రోజున ప్రపంచపాత్రికేయ దినోత్సవంగా నిర్వహిస్తూ పత్రికారంగంలో కృషిచేస్తున్న సీనియర్స్...