Home News ఆగిన బాల మురళి కృష్ణ గానం

ఆగిన బాల మురళి కృష్ణ గానం

0
SHARE

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ(86) ఈ రోజు సాయంత్రం చెన్నై లోని తన నివాసంలో కన్ను మూశారు. పట్టాభిరామయ్య, సూర్యకాంతం దంపతులకు జులై 6, 1930 న తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో జన్మించిన ఆయన ఆరేళ్ల చిన్న వయసులోనే గాయకుడిగా సంగీత ప్రస్థానం ప్రారంభించారు.

తన తండ్రి పట్టాభిరామయ్య వద్దే గాత్ర సంగీతంలోనే కాక వీణ, మురళి, వయోలిన్‌, మృదంగం లాంటి సంగీత వాయిద్యాల్లో ప్రావీణ్యం సాధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శృంగేరి పీఠాల ఆస్థాన విద్వాంసునిగా తన సేవలను అందించారు.

అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, రష్యా, శ్రీలంక, మలేసియా, సింగపూర్‌ లాంటి అనేక దేశాల్లో మంగళంపల్లి పలు సంగీత కచేరీలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 25వేల కచేరీలు చేసిన ఘనత ఆయనది. భారత ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్‌, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. జుగల్బందీ తరహా కచేరీ రూపకల్పనకు బాలమురళీకృష్ణ ఆద్యుడు.

bala-murali-krishna