Home News ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1

ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1

0
SHARE
  • క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం

ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ గురించి కొంత‌మంది క‌మ్యూనిస్టులు వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రిస్తూ త‌ప్పుడు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. అస‌లు చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే వాస్త‌వ విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. పురందర యుద్ధం గురించి వాస్త‌వాలు తెలియ‌ని క‌మ్యూనిస్టులు చ‌రిత్ర‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. సభాసద్ బకర్ అనే పుస్తకంలో అస‌లు వాస్త‌వాల‌ను మ‌నం తెలుసుకోవ‌చ్చు. పురందర యుద్ధం శివాజీ మహారాజ్ కి మిర్జా రాజా జయసింగ్ కి మధ్య యుద్ధం జరిగిన 32 సంవత్సరాల తర్వాత రాయబడిన పుస్తకం ఇది. బకర్స్ అనేవి మహారాష్ట్రలో ప్రామాణిక గ్రంథాలు కావున ప్రామాణికంగా తీసుకోవచ్చు. సభాసద్ బకర్ కు సురేంద్రనాథ్ గారి ఆంగ్ల‌ అనువాదాన్ని ప్రమాణంగా తీసుకొని, ఈ పురందర్ యుద్ధానికి సంబంధించిన వాస్త‌వ విష‌యాలు తెలుసుకుందాం…

శివాజీకి వ్య‌తిరేకంగా 400 మంది బ్రాహ్మణులు చేశార‌ని క‌మ్యూనిస్టులు చెబుతున్న త‌ప్పుడు క‌థ‌నాల‌ అస‌లు వాస్తవాల్ని గ‌మ‌నిద్దాం…

ఇప్పటికే ఇద్దరు ప్రధాన వీరులు అదిల్షా పంపించిన అఫ్జల్ ఖాన్, ఔరంగజేబ్ పంపిన షేస్తా ఖాన్ యుద్ధానికి వెళ్లి శివాజీ చేతిలో ఒకరు ఓడారు మరొకరు చనిపోయారు. ఈ సారి మూడవ వ్యక్తిగా రాజా జయసింగ్ శివాజీ బలాలపై యుద్ధం చేయాల‌ని నిర్ణ‌యించుకునంటాడు. దీనిలో భాగంగానే రాజా జయసింగ్ శివాజీ పురందరకోట మీద దాడి చేశాడు, కానీ శివాజీ ప్రధాన కోటైన రాయగడ్ కోట మీద దాడి చేయలేకపోయాడు. శివాజీ బలం దైవ బలం కాబట్టి నేను కూడా హిందూ రాజును, నేను కూడా అలాంటి బలం పొందాలంటే ఏమి చేయాల‌ని రాజా జయసింగ్ తన ఆస్థాన బ్రాహ్మణ పండితులను అడుగుతాడు. అప్పుడు వారు భవాని మాతను ఆరాధన చేయాలి చెపుతారు. ఒక కోటి చండి ఆరాధన, 11 కోట్ల సార్లు శివునికి రుద్రాభిషేకం చేయాల‌ని పండితులు రాజా జయసింగ్ కు చెప్తారు. రాజా జయసింగ్ గారు ఆ కాలంలోనే రూ.2 కోట్లు ఖర్చు చేసి, 400 మంది రాజస్థాన్ బ్రాహ్మణుల చేత మూడు నెలల పాటు అహోరాత్రులు శివలింగార్చ‌న, పూజలు చేసిన తర్వాత, తనకు శక్తి వచ్చిందని నమ్మి అప్పుడు ఆయన యుద్ధానికి బయలుదేరారు. మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే బ్రాహ్మణులు మొత్తం శివాజీకి వ్యతిరేకంగా పూజలు చేయలేదు. రాజస్థాన్ రాజైనటువంటి రాజా జయసింగ్ ఆస్థానంలోని కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే చేశారు. అది కూడా రాజు ఆజ్ఞాపిస్తే అలా చేయాల్సి వ‌చ్చింది. రాజు ఆస్థానంలో ఉన్న బ్రాహ్మణ పండితులు తమ రాజు బాగుండాల‌ని, యుద్ధంలో గెలవాల‌ని, వేరొక ప్రాంత రాజును ఓడించాలని పూజలు చేశారే తప్ప, శివాజీ మ‌హారాజ్ కి వ్య‌తిరేకంగా అత‌నన్ని ఓడించాలని వారు పూజలు చేయలేదు.

రాజా జయసింగ్ కూడా శివాజీ లాంటి యుద్ధ వీరుని ఎదురుకోవాలంటే దైవ బలం ఉండాల‌నితాను కూడా చండీ ఉపాసకుడిని అయ్యానని, చండీ దేవి అనుగ్రహం త‌న‌కు ఉంద‌ని, అందరికి తెలిసేలా ప్రచారం చేశాడు. ఇలా చేస్తే శివాజీ సైనికులలో మనోధైర్యం కోల్పోతారు అనుకున్నాడు. ఆ యుద్ధంలో రాజా జయసింగ్, శివాజీ ఇద్దరు ఓడిపోలేదు. ఆ యుద్ధంలో వారు సంధి కుదుర్చుకున్నారు. భవాని మాత ఇద్దరిని అనుగ్రహించింది. ఇది జరిగిన వాస్తవం. కానీ క‌మ్యూనిస్టులు దీన్ని వ‌క్రీక‌రిస్తూ బ్రాహ్మ‌ణులు
శివాజీకి వ్య‌తిరేకంగా పూజ‌లు చేశార‌ని త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నారు.

శివాజీ, మాలిక్ అంబర్ వద్ద యుద్ధ విద్యలు నేర్చుకున్నాడ‌ని, మ‌రో త‌ప్పుడు క‌థ‌నాన్ని ప్ర‌చారం చేస్తున్నారు. కానీ వాస్త‌వానికి శివాజీ తాత గారి చరిత్ర చూస్తే శివాజీ తాతగారు మాలోజి బోంస్లే, విటోజి బోంస్లే ఇద్దరు నిజాం షాహీ రాజ్యంలో సుల్తానికి ఎంతో విశ్వాస పాత్రులుగా పనిచేసే జాదవులు అనే మరాఠా సర్దార్ ల వద్ద పనిచేశారు.

ముస్లింలు వచ్చేంతవరకు క్షత్రియులు తప్ప క్రింది కులాల వారు కత్తి పట్టట్టే యోగమే ఉండేది కాద‌ని క‌మ్యూనిస్టులు అంటున్నారు. అది అవాస్త‌వం. 1100 సంవత్సరంలోనే దేవగిరిని యాదవులు పాలించారు. హరిహర రాయులు, బుక్కరాయలు కూడా కాకతీయులకు సామాంతులుగా ఉంటూ రాజ్యపాలన చేశారు. వారు క్షత్రియ కులానికి చెందినవారు కాదు. విజయనగరం పాలించిన శ్రీకృష్ణదేవరాయలే “నేను క్షత్రియని కాదు” అంటున్నప్పుడు, శివాజీ కంటే ముందు క్షత్రియులు కానీ వారు కూడా పరిపాలించారు. చంద్రగుప్త మౌర్యుల గురించి తీసుకున్న, నందులు ఎవరైతే ఉన్నారో వారు మంగలి (నాయి బ్రాహ్మణ) కులానికి చెందినవారు. వారు కూడా రాజ్యాలను పరిపాలించారు. వారు బీసీలే కదా?. కాబట్టి వారు చెప్పిన మొదటి విషయం తప్పు.

శివాజీ, యుద్ధ విద్యలు మాలిక్ అంబర్ వద్ద నేర్చుకున్నాడని క‌మ్యూనిస్టులు అంటున్నారు, అది అవాస్త‌వం. మాలోజి భోంస్లే (శివాజీ తాతగారు) వారు జాదవుల వద్ద పనిచేశారు.జాదవులు బహమనీ సుల్తాన్ల వద్ద పనిచేశేవారు. బహమనీ రాజ్యంలో అహమద్ నగర్ సుల్తాన్ల వద్ద మాలోజి భోంస్లే, లక్కుజి జాదవ్ అనే సర్దార్ కింద పని చేసేవారు. ఒకరోజు లక్కుజి జాదవ్ కుమార్తె (జిజియా బాయి) మాలోజి భోంస్లే కుమారుడు (షాహాజి భోంస్లే) వీరిద్దరు చూడడానికి చక్కటి జోడి అంటూ ఉండగా, దాన్ని నిజం చేద్దామని మాలోజి భోంస్లే అంటుండగా జాదవులు ఇది విని మాలోజి భోంస్లేను అక్కడి నుంచి పంపించేస్తారు. మాలోజీ భోంస్లే వచ్చి వ్యవసాయం చేస్తూ ఉండగా పొలంలో కొంత ధనం దొరకడంతో ఆ ధ‌నంతో వారు మంచి అశ్విక దళం ఏర్పాటు చేసుకొని, రాజులకు అవసరమైనప్పుడు సహాయం చేస్తూ, వారు మళ్లీ ప్రభావంలోకి వచ్చారు. దీంతో లక్కుజి జాదవ్ గారు మనసు మార్చుకుని జిజియా బాయి, షహాజి భోంస్లే ల వివాహం చేయించాడు. మాలిక్ అంబర్ 1626లో మరణించారు. అదేవిధంగా శివాజీ గారు 1627 లేక 1630లో జన్మించినట్లు చెబుతున్నారు.  1626లో మరణించిన మాలిక్ అంబర్ ఏ విధంగా శివాజీకి యుద్ధ విద్యలు నేర్పిస్తాడు. దీన్ని బ‌ట్టి క‌మ్యూనిస్టులు చెబుతున్న‌ది నూటికి నూరు శాతం అవాస్తవం అని తెలుస్తుంది.

రెండ‌వ భాగం – ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 2

మూడ‌వ భాగం – ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 3

నాల్గ‌వ భాగం – ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 4