Home News నోట్ల రద్దు విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న 10 పుకార్లు

నోట్ల రద్దు విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న 10 పుకార్లు

0
SHARE

ప్రభుత్వం యొక్క సాహసోపెతమయిన నోట్ల రద్దు అనే కార్యక్రమము మొదలై ఏడు రోజులు కావస్తున్నా దాని వేడి  ఇంకా చల్లారలేదు.  ప్రజలు ఆమోదయోగ్యమైన నోట్లను పొందుటకై బ్యాంకులు మరియు ఏటియంల చుట్టూ తిరుగుతూనే వున్నారు.  చాలామంది ప్రజలు ఈ దేశము కొరకై తమ వంతు ప్రయత్నం,  త్యాగం, బాధ్యతగా భావించి సర్దుకుపోతూ తమ పనిని తాము చేసుకొనిపోతూ వున్నా కూడా కొంతమంది దీనిని ఎలాగైనా అప్రతిష్ఠపాలు చేయడానికి కంకణం కట్టుకున్నారు.

నిరాధారమైన పుకార్లను ప్రజలలో వ్యాపింపచేస్తూ అల్లకల్లోలము కలిగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దోషులు ఎవరైనా కావచ్చును – స్వప్రయోజనతో ఉన్న రాజకీయనాయకులు, మీడియా దళారులు, 60:40 నిష్పత్తిలో పూర్వికుల ఆస్తులు అమ్ముకున్న పక్కింటి వారు లేక వాట్సప్ లో వచ్చే  ప్రతి వార్త నిజమని అనుకొనే ఒక మతిలేని స్నేహితుడు కావచ్చు.

ఇటువంటి పరిస్థితులలో ధాన్యమునుండి పొట్టుని వేరుచేయడము మరియు మన పెరట్లోని విషవృక్షాలను నిర్మూలించవలసిన అవసరము ఎంతైనా వున్నది. మీకు తెలిసినవారు ఎవరైనా నిజమని నమ్మే ఒక పది పుకార్లని ఈ క్రింద ఉదహరిస్తున్నాము:

  1. ట్రాన్స్ పోర్టర్లు సమ్మె చేయబోతున్నారు కావున మీరు నిత్యావసర వస్తువులను నిలువచేసుకోనండి.

వాట్స్అప్ లో కానీ పేస్ బుక్ లో కానీ ఈ వార్తను మీరు చూసే వుంటారు. రేపటినుండి ట్రాన్స్ పోర్టర్లు సమ్మె చేయబోతున్న కారణంగా నిత్యావసర వస్తువులు రవాణాకు ఆటంకము కలుగవచ్చును. ఇప్పటివరకు అసలు ఎటువంటి సమ్మెను ప్రకటించలేదన్నది వాస్తవం.  రవాణా మంత్రిత్వ శాఖ దీనిని ఖండిచింది.

  1. కొత్త నకిలీ కరెన్సీ నోట్లు బజారులోకి వచ్చేసాయి.

నకిలీ 2000 రూపాయల నోటుతో  మోసపోయానని  ఒక  కూరగాయల వ్యాపారి చెప్పాడని ఒక పుకారు ప్రచారంలో వుంది. ఇందువలన కొత్త నోట్లు భద్రమయినవి కావని ప్రజలలో కంగారు కలిగింది. అది ఒక కలర్ జిరాక్స్ అని తరువాత తెలిసింది. సమాచారం యొక్క శీర్షిక తప్పుదారి పట్టించే విధంగా వుంది. నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్లుగా భావించబడింది.

రెండు నోట్లను పరిశీలించిన యెడల అది కలర్ జిరాక్స్ అని  గుర్తుపట్టడానికి కష్టం కాదు అని తెలుస్తుంది.  ఆ కూరగాయల వ్యాపారిని తలుచుకుంటే బాధ కలిగినా కూడా, అది జిరాక్స్ కాపీ అని సులభంగా తెలుస్తుంది. నోట్ల చివరలను చూడండి.  మిగిలిన  సెక్యురిటీ మార్కులని చూడవలసిన అవసరముకూడా లేదు.

  1. క్రొత్త 2000 రూపాయల నోటుకి చిప్ లేదు.

ఒక పక్క కొత్త కరెన్సీ నోటు భద్రమయినది కాదని పుకార్లు ప్రచారములో ఉన్నప్పటికీ, నోటును ట్రాక్ చేయగలిగే నానో చిప్ దానికి ఉన్నదని కూడా ప్రచారములో వున్నది. జీ న్యూస్ అనే వార్త చానెల్ దానిగురించి ఒక రిపోర్ట్ కూడా ప్రసారం చేసింది. నోటుకు నానో చిప్ లేదు.

  1. ప్రజల వద్ద సరుకులు కొనడానికి డబ్బు లేనందు వలన డిల్లీ లో ఒక మాల్ ని దోచుకున్నారు

ప్రజల వద్ద సరుకులు కొనడానికి డబ్బు లేనందు వలన ప్రజలు దోపిడీకి పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతున్నది.  ఇది నోట్ల రద్దు వలన జరుగుతున్నది అని ప్రచారం చేస్తున్నారు.

ఇది సత్య దూరం. ఆ మాల్ కార్డ్ కలిగినవారు తమ సరుకులను తామే కొనుగోలుచేసుకొంటారు. ఆ  సందర్భములో కొందరు అరాచక శక్తుల వలన కొంత గొడవ జరిగింది లూటి జరగలేదు. డిల్లీ పోలీస్ దీనిగురించి ట్విట్టర్ లో వివరించారు.

  1. దేశము వ్యాప్తంగా ఉప్పు ధర అధికమయింది.

ఇది అన్నిటికన్నా ప్రముఖమయిన పుకారు. NDTV అనే చానెల్ కూడా దీని గురించి చేసిన ప్రచారము పుకార్లను ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం కలిగించింది. కొంతమంది అవకాశవాదులు ఉప్పు దొరకడం లేదంటూ ఈ పుకారును ఎక్కువగా ప్రచారం చేయడమువలన ఉప్పుధర  400 రూపాయలయినది. ఇది ఒక రకమయిన ఆందోళనకూ దారి తీసి దేశవ్యాప్తంగా  అధిక ధరల్లో కొనుగోళ్లకు దారితీసింది. కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పుకార్లను ఖండించడానికి స్వయంగా రంగంలోకి దిగవలసి వచ్చింది.

  1. బ్యాంకులలో జమ చేసే డబ్బు మీద 200% పెనాల్టీ విధించబడుతుంది.

బ్యాంకుల లో 2.5 లక్షల రూపాయల కన్నా ఎక్కువ డిపాజిట్లు చేసినచో ఎక్కువ పన్ను విధించాబడుతుందని  ప్రచారములో ఉన్నది. అది 95% నుండి 200% వరకూ వుండవచ్చని ప్రచారములో వుంది. ఈ పుకారును ఈ ఒప్ ఇండియా రిపోర్ట్ ఖండిస్తున్నది.

  1. బిజెపి నాయకులు మరియు వారి బంధువుల దగ్గర 2000 రూపాయలు ఇంతకు ముందే ఉన్నాయి.

ఆమ్ ఆద్మి పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ పుకారును ప్రచారము చేస్తున్నారు. ఈ ఒప్ ఇండియా రిపోర్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ IT సెల్  వారు బిజెపి నాయకుని కుమార్తెగా చూపించింది ఒక బ్యాంకు ఉద్యోగిని మరియు అ  ఆప్  పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రివాల్ అబద్ధాలను  ఖండిస్తున్నది.

  1. బ్యాంకులు మరియు ఏటియం ల ముందు పెద్ద పెద్ద క్యూల వలన జరిగే హింస

PTI న్యూస్ ఏజెన్సీ తమ ట్వీట్ లో ఢిల్లీ పోలీస్ వారు బ్యాంకులు మరియు ఏటియం ల ముందు పెద్ద పెద్ద క్యూల వలన హింస జరుగుతున్నదని తమకు 4 -5 వేల ఫోన్ కాల్స్ వచ్చి నట్లు చెప్పారని తెలిపింది.  PTI వార్తను పత్రికలు యధాతధంగా ప్రచురిస్తారని గుర్తించాలి. అందులో వున్నతప్పులు, పుకార్లు లేక అబద్ధాలు వేల సంఖ్యలో  వ్యాపిస్తాయి.  PTI యొక్క ఈ వార్త అబద్ధమని తేలింది. ఢిల్లీ పోలీస్ కి చాలా కాల్స్ వచ్చాయి కానీ అవి బ్యాంకులు మరియు ఏటియంల బయట వున్న క్యూ ల వలన కాదు. హింస కాదు తొక్కిసలాట జరిగిందని కూడా పుకార్లు పుట్టాయి. ఇవి అన్ని కూడా అబద్ధాలే.

  1. అసౌకర్యము మరియు డబ్బు కొరత చాలా మరణాలకి కారణమయ్యాయి

ఒకే ఒక్క మరణము జరిగినప్పటికీ ఇతర మరణాలను కూడా మీడియా నోట్ల రద్దుని కావాలని కారణంగా చూపిస్తున్నారు. మరణించిన ఒక వ్యక్తి బంధువులే ఆయన మరణానికి నోట్ల రద్దు కారణము కాదని చెప్పారు. మీడియా ఈ దుర్ఘటనలను వివాదాస్పదంగా చేయడానికి ఎలా వాడుకుంటున్నారు. ప్రమాదవశాత్తుగా జరిగింది కానీ లేదా కొన్ని వ్యక్తిగత కారణాల వలన జరిగిన ఆత్మహత్య అని తెలుస్తున్నది.

  1. బ్యాంకుల ముందు పెద్ద పెద్ద క్యూలు మరియు ప్రదర్శనల చిత్రాలు

బ్యాంకులు మరియు ఏటియంల ముందు క్యూలు వున్న మాట నిజమే.  డబ్బులు తీసుకొనే సమయములో వివిధ ప్రాంతాలలో జరుగుతున్న గొడవలు మరియు హింసగా చూపిస్తున్నారు.  కొన్ని రాజకీయపార్టీలు పాత చిత్రాలను చూపించి ప్రజలు కరెన్సీ నోట్ల రద్దు గురించి జరిగినట్లుగా చూపిస్తున్నారు.

ఇది అబద్ధమని ట్విట్టర్ లో బహిర్గతమైనది. అయినప్పటికీ మీరు వాట్సఆప్ మరియు ఫేస్ బుక్ లలో మీకు ఇంకా వస్తూ ఉండవచ్చు.

కావున ఈ పుకార్లను నమ్మవద్దు, జాగరూకతతో ఉండండి. ఈ వ్యాసాన్ని అధికంగా ప్రచారంచేయడము వలన ఈ పుకార్లకు అధిక ప్రచారం చేయడమువలన కలిగే భయబ్రాంతులను ఆపుట కొరకై ప్రయత్నం చేయగలరు.

Courtesy: OpIndia