“భారతదేశంలో వర్ణవివక్ష వలసవాద లక్షణమేకానీ సంప్రదాయంకాదు” – శ్రీ దీపాంకర్ గుప్త
విశ్వవ్యాప్తంగా మానవులందరిలో చాలావరకు కనిపించే ఒక సాధారణ లక్షణం ఆధిపత్యభావన. ఆర్ధికస్థితిగతులు, విజయాలు, మూలాల ప్రమేయం లేకుండా ప్రతివారు తమ సంస్కృతి, ఆచారాలు, భాష మిగతా అందరికంటే గొప్పవని గాఢంగా నమ్ముతారు. ఇది పైకి కనబడుతున్నంత చిన్నవిషయంకాదు. అయితే ఈ సాంస్కృతిక తేడాలను దురాక్రమణకు, ఆధిపత్యం చెలాయించడానికి మనం ఎప్పుడు ఉపయోగించ లేదన్నది సత్యం.
ప్రపంచ వ్యవస్థలో వలసపాలన ఒకపెద్ద మార్పును తీసుకువచ్చింది. మొదటిసారిగా ఒకప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వలస వచ్చి అక్కడ వనరులను దోచుకుని వెళ్లిపోవడం కాకుండా అక్కడే తిష్ఠ వేసుకునే పద్ధతి వచ్చింది. ఈ విధానాన్ని కొనసాగించడానికి సాంస్కృతిక పరమైన వ్యత్యాసాలు సరిపోలేదు. ఎందుకంటే అవి సహజమైనవి, మార్పు చెందేవి. వీటికి బదులు మార్చడానికి వీలులేని భౌతికవ్యత్యాసాల పైన ఆధారపడవలసి వచ్చింది. ఈ ధోరణి వల్లనే చార్లెస్ డార్విన్ సిద్ధాంతానికి ముందే యూరప్ లో అనేక పరిణామ సిద్ధాంతాలు పుట్టుకు వచ్చాయి.
వలసవిధానంలో సాంస్కృతిక వ్యత్యాసాలను అసలు పట్టించుకోలేదని కాదు. కానీ జాతి పరమైన తేడాలకే అధిక ప్రాధ్యాన్యత ఇచ్చారు. వలస పాలనకు ముందు కూడా జాతి పరమైన తేడాల గురించి మాట్లాడినా వాటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. అలెగ్జాండర్ తో వచ్చిన చరిత్రకారులు కూడా సింధునది ఆవలఉన్న ప్రజల శారీరిక వ్యత్యాసాల కంటే తామను ఆశ్చర్యపరచిన విషయాల గురించే ప్రధానంగా వర్ణించారు. చాలామంది తెల్లజాతీయులు ఆఫ్రికాదేశానికి యూరోపియన్లు వెళ్ళకముందు సంగతులు రాస్తూ అక్కడి ఆఫ్రికన్లు, తమ చిన్నముక్కుల గురించి,లావైన పెదాల గురించి,అన్నిటికంటేముఖ్యంగా రంగు గురించి ఎక్కువగా బాధపడేవారని చెప్పారు.
మరికొంతమంది భారతీయజాతుల మధ్య వ్యత్యాసాలను వలసవిధానాలలో ఉన్న విభేదాలతో పోలుస్తూ వేదకాలంలోఉన్నతెల్లనిఆర్యులు, నల్లని ద్రావిడులంటూ వ్రాసారు . దీని గురించి ఎంతో చర్చ సాగింది కూడా. కానీ రంగు అనేది విభజనకి, విచక్షణకి దారితీసిందని చెప్పడానికి ఎక్కువ ఆధారాలు లేవు.’వర్ణ’ అని వేదంలో చెప్పబడ్డ పదం ఒక వ్యవస్థ, క్రమాన్నితెలియజేస్తుందే తప్ప రంగుని కాదు. అలాగే ‘anas’ అనేది ఉచ్చారణ దోషాన్ని తెలుపుతుంది తప్ప అది ఎట్టి పరిస్థితిలోను చప్పిడి ముక్కును సూచించదు. వైదికదేవతలు ప్రీతిచెందడానికి సరైనమంత్ర ఉచ్చారణ అవసరం. సరైన ఉచ్చారణలేని వేదమంత్రాలు, వైదికప్రార్ధనలు బహిష్కరింపబడతాయి. అలాగే ‘bull lip’ గురించి వేదాలలోఒకచోటమాత్రమే ప్రస్తావన ఉన్నా, దాని గురించి తరచూ విశ్లేషణలు చేస్తుంటారు. భారతీయ పురాణాలలోఎద్దు కేవలం పనిచేయటానికి, శ్రమకు మాత్రమేకాదు, శక్తికి, అధికారానికి చిహ్నంగాచెప్పబడింది. అయితే కొంతమంది జాతి, వర్ణాలు ఒకటేనని చూపించే ప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తు డా. అంబెడ్కర్ తన ‘Annihilation of Caste’ అనే ప్రముఖ గ్రంధంలో ఈ ప్రయత్నాన్ని ఖండించారు.
ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం:
భారతీయ చరిత్ర – సంస్కృతి అధ్యయనకర్తలలో ఒకరైన విలియంజోన్స్ చెప్పిన సంస్కృతభాష, గ్రీకు మరియు లాటిన్ల మధ్య కొన్నిపోలికలుఉన్నాయనే వాదన ఆధారంగా కొద్దిమంది చరిత్రకారులు, భాషశాస్త్రవేత్తలు కొన్నివేలసంవత్సరాల క్రితం యూరోపియన్లు, కొంతమంది భారతీయులు కలసి ఒకే సమూహంగా ఉండేవారని చెప్పారు.
ఈ సిద్ధాంతం ప్రకారం ఒక యురోపియన్లే భారతదేశంపై దండెత్తివచ్చి ఇక్కడ స్థానిక ప్రజలపై ఆధిపత్యాన్నినెలకొల్పారు. ఈ సిద్ధాంతాన్ని కుల వ్యవస్థకు వివరణగా భావించారు. దీనిప్రకారం ఆర్యులు అనేవారు అగ్రవర్ణాలవారికి పూర్వులు.
అయితే పరిణామ సిద్ధాంతంలో దశాబ్దం పైగా జరిగిన పరిశోధనలు దీనిని అంగీకరించడంలేదు. అంతేకాదు ఈ పరిశోధన వివిధ భారతీయ జాతులు, వంశాల మూలాలు, పరంపరను నిర్ధారించింది.
కొన్నిఅధ్యయనాలు ఉత్తర, దక్షిణ భారతీయుల మధ్య జన్యులక్షణాల విషయంలో కొన్ని మౌలిక భేదాలను నిర్ధారించాయి. కొన్నిఇస్లాం మత వ్యాప్తి ద్వారా పశ్చిమ ఆసియా నుండి `జాతులు’ వచ్చాయని సూత్రీకరించాయి. మరికొన్నిమతం, వర్గం, ప్రాంతం ఏదైనా భరత జాతి అంతా ఒక్కటేనని నిర్ధారించాయి.
వలసవాద పాలనకు ముందు వివిధ ఖండాల మధ్య బానిసలకు కొనడం, అమ్మడం జరుగుతుండేది. అయితే అక్కడ నలుపు, తెలుపు రంగుపట్టింపులు ఉండేవికావు. ఎప్పుడైతే వలసవాదం ప్రవేశించిందో జాతి విభేదాలు పెరిగాయి. యూరోపియన్లు అధికులనే భావన పెరిగి మిగతావారిని తక్కువచేసి చూడడం జరిగింది. కానీ పూర్వకాలంలో చాలామంది యుద్ధ విజేతలు వారి జాతిబేధాలను పక్కనపెట్టి తమకు అలవాటులేని సాంప్రదాయాలతో కలసిపోయారు.
ఉదాహరణకి వైద్యరంగంలో ప్రధానమైన మందుల తయారీ, మిశ్రమాల తయారీ అక్బర్ రాజదర్బారైనా, కుబ్లై ఖాన్ రాజ్యమైన ఒకేలా ఉండేది. కానీ వలసవాదం ఈ పద్ధతిని కూడా మార్చేసింది. వలసపాలకుల కాలంలో భారతీయ వైద్యులు చులకనగా చూడబడ్డారు. యూరోపియన్ దేశాల్లో సూక్ష్మ జీవ వైద్యవిధానం కనుగొనకముందే భారతదేశంలో ఇవన్నీ జరిగాయి.
కాబట్టి ఆధిపత్య భావన వేరు, జాత్యహంకారం వేరు. ఆధిపత్య భావన ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా మానవ జాతిలో మొదటి నుండి ఉంది. కానీ వలసపాలకుల ఆధిపత్యాన్నిసమర్ధించడానికి జాత్యహంకారం కొత్తగా ప్రోత్సహించబడింది. ఈ జాత్యహంకారం క్రుసేడ్లలోగాని , చెంగిజ్ఖాన్ దాడులు, మొఘలుల పాలనలో గాని కనిపించదు. వీటన్నిటిలో రాజ్యాన్ని ఆక్రమించుకోవడం మాత్రమే కనిపిస్తుంది.
కానీ వలసవాదం విభిన్నమైనది. తమ మాతృ భూమి పట్ల మాత్రమే విధేయత కలిగిన విదేశాస్తులు ఒకరాజ్యం ఆక్రమించి దీర్ఘకాలం దానిని పాలించడం వలసవాదం లేదా వలస పాలన. దీనికోసం “మనం”, “వారు” అనే తేడాను పెంచి పోషించవలసి వచ్చింది. అందుకే జాతి పరమైన తేడాలను సృష్టించారు.
వలసపాలకులు ఆశించినట్లే ఈ కుట్రపూరిత పన్నాగం విజయం సాధించింది. వలస రాజ్యాల్లో సామాన్యప్రజలు ఈ భావాలను జీర్ణించుకున్నారు. 19 వ శతాబ్దానికి చెందిన రచయిత, పండితుడు బంకించంద్ర ఒకచోట వ్రాస్తూ తన శరీరంలో ఆర్యుల రక్తం ప్రవహిసున్నందుకు తనకు గర్వంగా ఉందని పేర్కొంటారు. అయితే ఉత్తరభారతీయుల అనువంశికత మార్పుల్లో ఆఫ్రికన్ జాతుల లక్షణాలు కలసి ఉన్నాయనే విశ్లేషణ కాస్త ఇబ్బందినే కలిగిస్తుంది. అయితే ” ఆర్యులదండయాత్ర “భావనను కాదనగల జన్యుసాక్ష్యాలు ఏవీ ఇంకాలేవని ఈ సందర్బంగా మనం గుర్తించాలి.
మనం ఆఫ్రికన్ ల మీద భౌతికవిమర్శలు చేయడం మన వలసవాద మానసిక లక్షణమేతప్ప, మన సాంప్రదాయంకాదు. భారతీయుల్లో చాలామంది ఆఫ్రికన్ ల కంటే నల్లగా ఉంటారనే విషయాన్నిపక్కనపెట్టి మనం ఆఫ్రికన్లను చిన్నచూపు చూడటం,తక్కువ జాతివారీగా భావించటం వలసపాలకుల లక్షణాలను గుర్తుచేస్తుంది. మారుతున్నఅనువంశిక లక్షణాలతో మనం మన శరీర రంగును, పుట్టబోయే పిల్లల రంగును మార్చలేము. ఇప్పటికీ ఒక నలుపురంగు వ్యక్తికి వివాహ విషయంలో ప్రాధాన్యత ఇవ్వబడదు. అలాగే పొట్టివాళ్లకి, బట్టతలవాళ్లకి వివాహవిషయంలో ప్రాధాన్యత తక్కువ. అయితే సంపద, అధికారం, స్ఫూరద్రూపం, విషయంలో ఈ రంగు అనే అడ్డంకి అధిగమించ లేనిది కాదు. అందులోను fair and lovely వంటి ఉపాయాలుఉండగా….
వలసవాదం రూపుమాసిన చాలాఏళ్ళ తరువాత ఇంకా యూరోపియన్ ల గురించి ఆలోచిస్తూ, మనం ఆఫ్రికన్లకంటే గొప్పవాళ్ళం అని చెప్పుకోవడం అసందర్భమైన విషయం. మనం పూర్తిగా తెల్లవాళ్ళముకాదు, నల్లవాళ్ళమూ కాదు. ఖాకీరంగు వాళ్ళం .
ఆంగ్ల మూలం : Let’s talk about racism | Colour bias in India is colonial, not traditional