దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకు కేంద్రం పొడిగించింది. అయితే కంటైన్‌మెంట్ జోన్‌ల వరకే దాదాపు పరిమితం చేసింది. అలాగే లాక్‌డౌన్ 5.0 మార్గదర్శకాలను కూడా ప్రకటించింది.
జూన్ 8 నుండి ఈ సడలింపులు అమల్లోకి రానున్నాయి. జూన్ 8 నుండి ప్రార్థనా సమావేశాలు, దేవాలయాలు, హోటల్స్, మాల్స్ ప్రారంభించుకోవచ్చని తెలిపింది. దీంతో తిరుమలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలన్నీ జూన్ 8 నుండి తెరుచుకోనున్నాయి.
అయితే సినిమా హళ్లు, మెట్రోలు, పార్కులు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవు. రాష్ట్రాలను సంప్రదించిన అనంతరం విద్యాసంస్థల నిర్ణయం తీసుకోనుంది. రాత్రి వేళ్లల్లో ఉన్న కర్ఫ్యూ సమయాన్ని కుదించింది. మే 31 నుండి రాత్రి 9 నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ సమయంగా మార్పు చేసింది.
జిమ్, సినిమా హాళ్లు, మెట్రో రైళ్లు, బార్లు, స్విమ్మింగ్ ఫూల్స్‌కు అనుమతినివ్వలేదు. రాష్ట్రాలను సంప్రదించిన తర్వాతే విద్యాసంస్థల పున: ప్రారంభంపై నిర్ణయం తీసుకోనుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌కు గ్రీన్ సిగల్ ఇచ్చింది.
రాష్ట్రాల మధ్య రాకపోకలకు, సరుకుల రవాణాకు ఎటువంటి అనుమతులు అవసరం లేదు. మరోవైపు పరిస్థితిని బట్టి మెట్రో రైలు సర్వీసులు, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది.
Source: www.nijam.org