Home News 130 మంది చిన్నారులతో వి.హెచ్.పి వారి శ్రీ భగవద్గీత కంఠస్థ పోటీలు

130 మంది చిన్నారులతో వి.హెచ్.పి వారి శ్రీ భగవద్గీత కంఠస్థ పోటీలు

0
SHARE

విశ్వా హిందూ పరిషత్ వారు జోగులాంబ గద్వాల జిల్లాలో ఆదివారం నిర్వహించిన  శ్రీ మద్బగవద్గీతలోని 17వ అధ్యయనం కంఠస్థ  పోటీలలో వివిధ పాఠశాలలకు చెందిని 130 మంది విద్యార్థులు పాల్గొన్న చిన్నారులు భగవద్గీత లోని శ్లోకాలను కంఠస్థగా పలికారు.

అశ్రద్ధ్ద్యా హుతం దత్తం తప స్తప్తం కృతం చయత్

అస దిత్యుచ్యతే ప్రార్థన చ తత్ప్రేత్య నోఈ ఇహ..

యే శాస్త్రవిధి ముత్సృజ్య యజన్తే శ్రద్ధయాన్వితాః

తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్త మహో రజస్తమః

అంటూ చిన్నారులు భగవద్గీతలోని శ్లోకాలను పలికారు.

ప్రాథమిక స్థాయిలో తరణి ( సరస్వతి టాలెంట్ స్కూల్), సౌమ్య (సత్య సాయి స్కూల్), భూమిక (శారద పబ్లిక్ స్కూల్) ఎంపిక చేయబడ్డారు. తస్లీమా కౌసర్ (శ్రీ సరస్వతి శిశు మందిరం) కన్సొలేషన్ బహుమతి పొందింది.  మాధ్యమిక స్థాయిలో సౌమ్య (దయానంద), హరణి (విశ్వబరతి స్కూల్), అరవింద్( ప్రాక్టిసింగ్ హై స్కూల్, గద్వాల్), ఉన్నత స్థాయిలో రోహిత్, శశాంక్ (సత్య సాయి విద్యాలయం), శ్రీజ (ప్రాక్టిసింగ్ హై స్కూల్) విడర్య్తులు తం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కై వసం చేసుకున్నారు.

vhp-3

ఈ సందర్బంగా వి.హెచ్.పి నాయకులు నేటి తరం విద్యార్థులలో సంస్కారం, ఉచ్చారణ, జ్ఞ్యాపక శక్తి, హిందూ ధర్మాన్ని కాపాడేటందుకు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ హిందూ ధర్మం విశ్వకల్యాణ సాధనకు సనాతనమైన మాధ్యమమన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లల్లో భగవద్గీత పారాయణం చేయడం అలవాటు చేసుకోవాలన్నారు.

vhp-2

ఈ ఉత్సవాలను జిల్లా కేంద్రంలోని కోటలో గల భూ లక్ష్మి చిన్న కేశవ స్వామి ఆలయంలో ఆదివారం నిర్వహించారు. వి.హెచ్.పి సహా కార్యదర్శి శ్రీ రమేష్ గారు, శ్రీ కిషన్ రావు, శ్రీ విజయ్‌కుమార్,  బస్వరాజ్, మల్లికార్జున్, గోవిందుస్వామి, శ్రీమతి అరుణ, దివ్య, శ్రీదేవి తదితరు లు పాల్గొన్నారు.

vhp