మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన పాస్టర్ ను అరెస్టు చేసిన ఘటన తమిళనాడులో ఓటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… బాధిత బాలిక, ఆమె సోదరుడు చర్చి నిర్వహించే పాఠశాలలో చదువుతున్నారు. అండ్రూస్ అనే చర్చి పాస్టర్, అతని భార్య నేతృత్వంలోని మహిళలు, పిల్లల హాస్టల్ నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 14న బాలిక ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రార్థనకు హాజరుకాలేక హాస్టల్‌లోని తన గదిలోనే ఉండిపోయింది. ఆ సమయంలో పాస్టర్ బాలికతో తప్పుగా వ్యవహరించాడు. జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు.
అయితే క్రిస్మస్ సెలవుల సందర్భంగా బాలిక హాస్టల్ నుండి ఇంటికి వెళ్లింది. తిరిగి హాస్టల్‌కు రావడానికి ఇష్టపడలేదు. దీనిపై ఆమె తల్లిదండ్రులు ప్రశ్నించగా అసలు విషయాన్ని వెల్లడించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. ఈ బుధవారం పాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.