Home News ‘సర్ తన్ సే జుదా’ నినాదాలు చేసిన ముగ్గురు AIMIM నేతలపై కేసు నమోదు

‘సర్ తన్ సే జుదా’ నినాదాలు చేసిన ముగ్గురు AIMIM నేతలపై కేసు నమోదు

0
SHARE

హైదరాబాద్ పాతబస్తీలో సర్ తన్ సే జుదా (త‌ల న‌రికివేయండి) అంటూ బెదిరింపు నినాదాలు చేసినందుకు AIMIM పార్టీకి చెందిన ముగ్గురు నేతలపై కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. AIMIM నాయకులు నస్రీన్ సుల్తానా, మీర్ సర్దార్ అలీ, జాఫర్ ఖాన్‌లపై నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో IPC, మత హింస నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది.

కొన్ని నెలల క్రితం బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రవక్త మహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యల‌ను నిర‌సిస్తూ హైదరాబాద్‌లోని పాతబ‌స్తీలో పలువురు AIMIM నాయకులు బహిరంగంగా బయటకు వచ్చి “ససర్ తన్ సే జుదా” నినాదాలు చేశారు.

ఈ బెదిరింపు నినాదాలు చేసిన AIMIM నాయకులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక వ్యక్తి మల్కాజిగిరి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచార‌ణ చేసిన కోర్టు “సర్ తన్ సే జుదా” నినాదాలు చేసిన AIMIM నాయకులపై కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేర‌కు నేరేడ్‌మెట్ పోలీసులు AIMIM కార్పొరేటర్ నస్రీన్ సుల్తానా, జాఫర్ ఖాన్, మీర్ సర్దార్ అలీలపై IPC సెక్షన్లు 153-A, 506, 509, మత హింస నిరోధక చట్టంలోని సెక్షన్ 19 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.