Home News సమరసతతో భారత దేశ అఖండతను కాపాడాలి -డాక్టర్ వంశాతిలక్

సమరసతతో భారత దేశ అఖండతను కాపాడాలి -డాక్టర్ వంశాతిలక్

0
SHARE

సమరసతతో భారతదేశ అఖండతను కాపాడుకోవాలని, కుల వైశమ్యాలు తొలగినపుడే దేశంలో సామాజిక సమరసత సాధ్యమవుతుందని, హైందవంలో జన్మతః కులాలు ఉండేవి కాదని ఇవన్ని మానవులు సృష్టించుకున్నవి కాబట్టి అంతరాలు మరిచిపోయి సమానత్వంతో సోదరభావంతో కలిసి మెలిసి జీవించాలని అన్నారు. మనిషిని మనిషిగా చూడాలని అందరిలో పరమాత్ముని చూసే తత్వం కలిగి ఉండాలని సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వంశాతిలక్ గారు పేర్కొన్నారు.

సిద్దిపేట్ జిల్లా దుబ్బాక లో 10 ఏప్రిల్ నాడు  డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, మహాత్మ జ్యోతిబాఫులే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ల జయంతుల సందర్భంగా నిర్వహించిన “సామాజిక సమానత్వ సాధనలో మహనీయుల పాత్ర” అనే అంశం పై జరిగిన సదస్సులో  డాక్టర్ వంశాతిలక్ గారు పాల్గొన్నారు.

సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ జీ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివారు అని అన్ని కులాలు వివక్షతను వదిలి దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలని అన్నారు. కులం పేరుతో ఉద్వేగాలు రెచ్చగొట్టే శక్తుల నుండి జాగ్రత్తగా ఉండి విడిపోకుండా కలిసిమెలిసి ఐక్యంగా ఉండాలన్నారు. హిందూ సమాజంలో అనైక్యతతో దేశ సమగ్రతకు భంగం వాటిల్లకుండాఉండాలని అన్నారు. అంబేద్కర్ పేరుతో భారత దేశానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తుల నుండి జాగరూకులై సోదరభావంతో అన్ని కులాల వారు మన సోదరులే అనే భావనతో ఉండి సామాజిక సమరసతకు కృషి చేయాలని అన్నారు.

ఈ ముగ్గురు  మహనీయుల అడుగుజాడల్లో నడిచి అంటరానితనం,కుల అసమానతలు రూపుమాపాలని వక్తలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక సిద్దిపేట్ జిల్లా అధ్యక్షులు ఉప్పరి రత్నం గారు,ఉపాధ్యక్షులు రాజశేఖర్ గారు,కార్యదర్శి శివరాజం గారు,సహ సంయోజక్ రమేష్ గారు,మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పల మశ్చేంద్రనాథ్ గారు,కార్యదర్శి భైరం నర్సింలు గారు,వివిధ క్షేత్రాల భాధ్యులు,వివిధ యువజన సంఘాల నాయకులు,సభ్యులు,కుల సంఘాల భాధ్యులు,పరిసర గ్రామ ప్రజలు సుమారు 140 మంది పాల్గొన్నారు.