Home News ఆజ్ఞా పాలన

ఆజ్ఞా పాలన

0
SHARE

గురుగోవిందుడు తన రాజ్యాన్ని కోల్పోయాడు. సైన్యం కూడా విడిపోవలసి వచ్చింది. తాను పదిమందితో ఒక చోట నుండి మరొకచోటికి వెళ్లిపోతున్నాడు. ఒకరోజు ఒక పెద్ద గ్రామానికి వచ్చారు వారంతా. ఆ గ్రామంలో ఆ ప్రాంతపు జాఠ్‌ సర్దారున్నాడు. అతడు గురుగోవిందుణ్ణి సాహస కృత్యాలను విన్నాడు. తన జాగీరులో ఆయన ప్రవేశించగానే ఎదురు వెళ్లి ఆహ్వానించాడు.

ఆ గ్రామానికి వచ్చి రెండు రోజులైనా గోవిందుణ్ణి ఆ జాఠ్‌ సర్దార్‌ పోనివ్వలేదు. గురుగోవిందుడు తన సహాయం అపేక్షిస్తే తాను వెంటనే సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండు రోజులైనా గోవిందుడా మాటే యెత్తలేదు. ”మీరు అంగీకరిస్తే నా జాఠ్‌ వీరులు మీకు సాయంగా నిలబడి, మీ కార్యాన్ని సఫలీకృతం చేస్తారు” అని గోవిందునికి చెప్పడానికి ఆయనకు అహంకారం అడ్డం వచ్చింది. గోవిందుని ప్రవర్తనలో ఎట్టి మార్పులేదు. తన కుటుంబ సభ్యులంతా తలా ఒక దిక్కైనా, రాజ్యం పోగొట్టుకున్నా ఆయనలో ఆ విచారమే కనబడలేదు. గురుగోవిందునిలాంటి గొప్పవానికి తన శౌర్యాన్ని, తన జాఠ్‌వీరుల శౌర్యాన్ని అందరికీ చూపించెదెలా? ఇలా సాగారు అతని ఆలోచనలు.
”గురుగోవిందుడు, తన సైనికుల శౌర్యాన్ని, ప్రతాపాన్ని తక్కువ అంచనా వేశాడేమో” ఈ అనుమానం సర్దార్‌లో ప్రబలసాగింది. అది నాలుగోరోజు. మధ్యాహ్నం భోజనమై కొంత విశ్రమించిన తర్వాత గురుగోవిందుని జాఠ్‌సర్దార్‌ కలిశాడు. గురూజీ! మీకు చాలా కష్టం వచ్చిపడ్డది. మీ సైన్యం కూడా చాలా నష్టమైపోరుంది. అయినా దిగులుపడవలసిన పనిలేదు. మా సైనికులున్నారు. వారు మహాయోధులు, శౌర్యవంతులు. ఒక్కొక్కరు వేరుమంది సైనికుల పెట్టు. వారిని మీరు ఉపయోగించవచ్చు. ధర్మకార్యమేదైనా చేయడానికి వారు ఎల్లప్పుడూ సంసిద్ధులు. మీరు కోరితే వారిని వెంట పంపుతాను, నేను కూడా వస్తాను. పోగొట్టుకున్న రాజ్యాన్ని మేము మీకు సంపాదించి పెడ్తాము”అని అన్నాడు సర్దారు. గురుగోవిందుడు మందహాసం చేశాడు. మరేమీ మాట్లాడలేదు. కొంతసేపు ఇద్దరు ఊరకనే కూర్చున్నారు. మళ్లీ గోవిందునితో తన సైనికుల ప్రతాపాన్ని గూర్చి చెప్పటం మొదలుపెట్టాడు.

రెండవసారి కూడా గోవిందుడు చిరునవ్వుతో ఆయన అభ్యర్థనలని పట్టించుకోకుండా ఊరుకున్నాడు. అరుతే సర్దారు తన సైనికులు ఏయే యుద్ధాల్లో పోరాడారో, ఎంత సాహస కృత్యాలు చేశారో, ఎన్నెన్ని సార్లు విజయాలు చేకూర్చి పెట్టారో వాటినన్నింటిని ఏకరువు పెట్టాడు. ఈసారి గోవిందుడు ప్రసన్నుడుగా కన్పించాడు. సర్దారుకు సంతోషమేసింది. ఇంతలో అక్కడికి గురుగోవిందుని సైనికుడొకడు తుపాకిని పట్టుకవచ్చాడు. గురుగోవిందుడు ఆ తుపాకిని చేతికి తీసుకున్నాడు. తన సైనికుణ్ణి పంపివేశాడు. సర్దారుతో అన్నాడు. ”ఈ తుపాకి సరిగా కాలుస్తుందో లేదో చూస్తాను. మీ సైనికుణ్ణొకణ్ణి నాకు ఎదురుగా నిలబడమనండి” అన్నాడు. ”ఏమిటీ పిచ్చి! తుపాకిని పరీక్షించటం మనిషి మీదనా? యుద్ధభూమిలో వీరవిహారంచేస్తూ మరణించాలని కోరే సైనికుడు తన ప్రాణాన్ని ఒక తుపాకి పరీక్షకెరజేస్తాడా? దీనిలో వీరత్వ ప్రదర్శనమేముంది. అలా ఆలోచిస్తున్నాడు సర్దారు. ”గోవిందుడు రాజ్యాన్ని కోల్పోరు, మతిస్థిమితం పోగొట్టుకున్నట్లు కనపడుతున్నది. నేను సాయం చేద్దామని నొక్కినొక్కి అడిగితే ఈ వెర్రి పనికి పూనుకున్నాడు. నిజంగా గోవిందుడు మతిని పోగొట్టుకున్నాడు”అని అనుకున్నాడు సర్దారు. ఇంతలో మళ్లీ గోవిందుని పిలుపు ”ఏమి సర్దార్‌, సైనికుణ్ణి ఒకణ్ణి త్వరగా ఇక్కడకు పంపు. తుపాకిని పరీక్షిస్తాను. ఏదో ఆలోచిస్తున్నావు?” సర్దారు గుండెలో రారు పడ్డది. ఇప్పుడేమి చేయాలి? సర్దార్‌ లేచి ప్రక్క గదిలోని తన సైనికులకా విషయం చెప్పి, గురుగోవిందుని వద్దకు వెళ్లమన్నాడు. సైనికులు ఒకరి ముఖాలనొకరు చూసుకున్నారు. వారిలో వారు గుసగుస లాడుతున్నారు. ”ఏమిటీ పిచ్చి! ఎవడైనా తుపాకి పరీక్షకు వీరసైనికుణ్ణి బలిచేస్తాడా? సర్దారు వారిని తొందరపెట్టసాగాడు. సైనికుల్లో ఒకడు లేచి ఇలాంటి పిచ్చి పని మేమెవ్వరము చేయమని స్పష్టంగా చెప్పేశాడు. సర్దారు అహంకారం దెబ్బతిన్నది. తలవంచుకొని, అవమానంతో క్రుంగిపోతూ గోవిందుని వద్దకు వచ్చాడు.

గోవిందుడు తన వద్దనున్న సేవకునితో తన సైనికుల్లో ఒకనిని అక్కడికి పిల్చుకరమ్మన్నాడు. సేవకుడు వెళ్లాడు. ఈ వార్త వాళ్లకందజేశాడు. తక్షణమే ఒక సైనికుడు ‘ఈవార్త గురువుగారి వద్దనుండి నాకు ముందే చేరింది. గురువు నన్నే రమ్మన్నాడు. నేను వెళ్తున్నాను’ అన్నాడు. వానిని వెనుకకు లాగి మరొక సైనికుడు ముందుకు వచ్చి ”గురువుగారు ఈ వార్త నాకే ముందు అందజేశారు. నేను వెళ్లా”నని అడుగుముందుకు వేశాడు. ఈ విధంగా వారిలో వారు తనను ముందు పిలిచారంటే తనను ముందు పిల్చారని వాదులాడుకుంటున్నారు. సేవకుడు వారి సంసిద్ధతకు ఆశ్చర్యపోరు ఏమీ చెప్పలేక దిగాలుపడి నిలబడిపోయాడు. వారీవిధంగా వాదులాడుకుంటుంటే గోవిందుడు విన్నాడు. వారందర్నీ తన వద్దకు రమ్మని బిగ్గరగా పిలిచాడు. బిలబిలమంటూ అందరూ పరుగెత్తుకొని అక్కడికి వచ్చి చేరారు. గోవిందుడు వారివైపు తుపాకిని చూపి ”దీన్ని పరీక్షించాలి. మీలో ఒకడు ముందుకు రండి” అన్నాడు. అంతే, ఒకడు ముందుకు వచ్చాడు. వాని వెనుకకులాగి మరొకడు ముందుకు వచ్చాడు. గోవిందుడు తుపాకి గురిని ప్రక్కక తిప్పాడు. ఆ ప్రక్కకు సైనికులంతా పరుగెత్తారు. ఇదంతా చూస్తుంటే సర్దారుకు పిచ్చి పట్టిపోరుంది. ”వీళ్లంతా మానవులా లేక పిశాచాలా? వీరికి చావంటే భయమేలేదే?” అతని కండ్లవెంబడి నీళ్లు ధారాపాతంగా కారటం మొదలుపెట్టినై. దానితో వాని అహంకారం అంతా కారిపోరుంది. అంతలో గోవిందుడాజ్ఞాపించాడు.

”మక్కన్‌సింగ్‌, ముందుకురా! నీమీద గురిచూస్తాను”. వెంటనే మక్కన్‌సింగ్‌ పరుగెత్తుక వచ్చాడు. సర్దారు భరించలేకపోయాడు. ఇటువంటి త్యాగసింహాలతోనా తాను తన సైనికుల్ని పోల్చాడు. తన సైనికులు వారిముందు దేనికి పనికివస్తారు? వెంటనే లేచి గురువు కాళ్లమీద పడి తనను క్షమించమని కన్నీరు మున్నీరుగా విలపించసాగాడు. తనను క్షమిస్తేనేగాని తాను లేవనని పట్టుపట్టాడు. గురుగోవిందుడు తుపాకి అక్కడ పారవేసి, సర్దారును లేవనెత్తి చిరునవ్వుతో కౌగలించుకున్నాడు. అతన్ని అనునయ వాక్యాలతో సమాధాన పరిచాడు. –

(‘చాపేకర్‌ సోదరులు’ పుస్తకము నుండి)

(స్ఫూర్తి సౌజన్యం తో)