Home News వ్యక్తి నిర్మాణమే కేంద్రంగా అర్ ఎస్ ఎస్ చేస్తున్న ప్రయత్నం  విశిష్టమైనది : శ్రీ వి వి లక్ష్మినారాయణ,...

వ్యక్తి నిర్మాణమే కేంద్రంగా అర్ ఎస్ ఎస్ చేస్తున్న ప్రయత్నం  విశిష్టమైనది : శ్రీ వి వి లక్ష్మినారాయణ, మాజీ డి జి పి ముంబాయి

0
SHARE

సమాజంలో ఇంకా ఎన్నో ప్రతిబందకాలు, సమస్యలు ఉన్నప్పటికీ  నేడు దేశంలో మనకు ప్రత్యక్షంగా కనపడుతున్న పరివర్తన సానుకులమైనది. రాబోవు కాలంలో ప్రపంచంలో ఒక శక్తి వంతమైన ఆదర్శవంతమైన భారత దేశం పునర్ నిర్మించే క్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో శిక్షణ పొందిన స్వయంసేవకుల పాత్ర ప్రముఖంగా ఉంటుంది. ఇది నా ప్రగాడమైన విశ్వాసమని మాజీ పోలీస్ అడిషనల్ డి జి పి, ముంబై, సి బి ఐ జాయింట్ డైరెక్టర్   శ్రీ వి వి లక్ష్మినారయణ అన్నారు.

హైదరాబాద్ కు  దగ్గరలోని అన్నోజిగూడ గ్రామంలో జరిగిన ఆర్ ఎస్ ఎస్  ప్రథమ  వర్ష సంఘశిక్షా వర్గ  సార్వజనికోత్సవం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీ  లక్ష్మినారాయణ మాట్లాడుతూ సమాజ పరివర్తనకు వ్యక్తే కీలకం అని, అందుకు అనుగుణంగా వ్యక్తి నిర్మాణమే ధ్యేయంగా పని చేస్తున్న ఆర్ ఎస్ ఎస్  కార్యక్రమాలు ప్రయోజనకరమైనవని అన్నారు. దేశ ప్రగతిలో కీలకమైన శారీరక, మానసిక, బౌద్ధిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంశాల పట్ల శ్రద్ధ వహిస్తూ యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సమాజం పట్ల సేవాభావము కలిగిస్తున్న అర్ ఎస్ ఎస్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

సార్వజనికోత్సవంలో  ప్రధాన వక్త సహ ప్రాంత ప్రచారక్ శ్రీ లింగం శ్రీధర్ మాట్లాడుతూ ఈ దేశానికి హిందుత్వమే ఆత్మ అని, హైందవ చైతన్యమే శ్రీ రామరక్ష అని మన సమాజంలో ఉన్న అనైక్యతలను భేద భావాలను తొలగించి సంఘటితమై, శక్తివంతమైన హిందూ సమాజాన్ని నిర్మించి భారతదేశాన్ని తిరిగి విశ్వ గురు స్థానానికి తీసుకువచ్చే కృషి అర్ ఎస్ ఎస్ చేస్తున్నదన్నారు.

స్వాతంత్ర్యానికి పూర్వం సమాజంలోని కొంతమంది హిందువుగాచెప్పుకోవడానికి కూడా సిగ్గు పడేవారని, హిందూ సమాజమంటే  అస్తిత్వం లేని, గుణ రహితమైన, ఐక్యత లేని వారు అనే అపవాదు ఉండేది, కాని గత 92 సంవత్సరాల నిరంతర కృషి,  స్వయంసేవకుల త్యాగం వలన నేడు మనం ఆనాటి బలహీనతలను జయించి “నేను హిందువును, ఇది హిందూ రాష్ట్రము” అని గర్వంగా చెప్పుకునే స్థాయికి రావడం మన ఘనత అని అన్నారు.

గత 1000 సంవత్సరాల చరిత్రలో మనం నష్టపోవడానికి ముస్లిం, క్రిస్టియన్, బ్రిటిష్ వాళ్ళను ప్రతి సందర్బంలో దోషిగా చూపెట్టడంలో అర్ధం లేదని,  ఎంత దుర్బగ్యపు  స్థితిలో  మనం జీవించామన్నది  మన అందరికి తెలుసని అన్నారు. కాని ఈ రోజు హిందూ సమాజం తన స్వశక్తి , మేధస్సుతో ప్రపంచానికి మార్గదర్శనం చేయగల సత్తా ఉన్నదీ అని నిరూపించుకోవాలి.  అందుకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా దేశ నిర్మాణం లో నిస్వార్ధంగా పాల్గొనాలి అని యువతకు పిలుపునిచ్చారు. అందుకు ఆర్ ఎస్ ఎస్ లో భాగస్వాములు  కావాలని కోరారు.

ఈ వర్గలో  419 మంది కార్యకర్తలు శిక్షణ పూర్తి చేశారు. వీరిలో వివిధ వృత్తులలో ఉన్నవారు. విద్యార్థులు, అధ్యాపకులు, డాక్టర్లు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు తమ స్వంత ఖర్చును భరిస్తూ 20 రోజులు పూర్తిగా ఇక్కడే ఉంటూ శిక్షణ పొందారు.

మా శ్రీ బి దక్షిణామూర్తి, ప్రాంత సంఘచాలకులు, శ్రీ ఎ శ్యాం , దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్, శ్రీ కాచం రమేష్, తెలంగాణా ప్రాంత కార్యవాహ తో సహా  వివిధ భాద్యతలలో ఉన్న సంఘ అధికారులు శిబిరంలో పాల్గొన్న స్వయంసేవకులకు మార్గదర్శనం చేసారు.