Home Telugu Articles శబరిమల: అయ్యప్ప భక్తుల శాంతియుత ఆందోళనల్లో విధ్వంసానికి కుట్ర?

శబరిమల: అయ్యప్ప భక్తుల శాంతియుత ఆందోళనల్లో విధ్వంసానికి కుట్ర?

0
SHARE
శబరిమల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సాగుతున్న అయ్యప్ప భక్తుల శాంతియుత ఆందోళనల్లో తీవ్రవాదులు విధ్వంసానికి కుట్ర పన్నుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయ్యప్ప భక్తుల నిరసనల్లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఇబ్రహీం కుట్టీ సివిల్ దుస్తుల్లో పాల్గొన్న ఘటన అనుమానాలను మరింత బలపరుస్తోంది. ఈనెల 18న నీలక్కల్ ప్రాంతంలో జరిగిన అయ్యప్ప భక్తుల నిరసనల్లో ఇబ్రహీం కుట్టీ సివిల్ దుస్తులు ధరించి భక్తుల్లో కలిసిపోయి ఆ ప్రదర్శనల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.  దీని ద్వారా అయ్యప్ప భక్తులు చేపట్టిన శాంతియుత నిరసనను భగ్నం చేసి, శబరిమల పుణ్యక్షేత్రాన్ని సమస్యాత్మక ప్రాంతంగా మార్చడానికి ఇబ్రహీం ప్రయత్నించాడా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఒక వార్తా సంస్థ కధనం ప్రకారం.. గతంలో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాది, బెంగళూరు పేలుళ్ల కుట్రదారుడు నజీర్ పోలీసు కస్టడీ నుండి తప్పించుకున్న ఘటనలో కానిస్టేబుల్ ఇబ్రహీం కుట్టీ పాత్రమీద దర్యాప్తు చేసిన ప్రభుత్వం సంవత్సర కాలం పాటు అతడిని సస్పెండ్ చేసింది. ఆ సమయంలో పోలీసు వాహన డ్రైవరుగా పనిచేస్తున్న ఇబ్రహీం స్వయంగా తానే పోలీసు వాహనంలో నాజీరుని తిరువనంతపురం సెంట్రల్ జైలు నుండి ఎర్నాకుళం జిల్లాలోని అలువా  కోర్టుకి తీసుకెళ్తున్న సమయంలో ‘సాంకేతిక లోపం’ కారణంగా వాహనం ఆరూర్ బ్రిడ్జ్ వద్ద ఆగిపోయింది. ఐతే ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం అప్పటికే ఆ బ్రిడ్జ్ కింద ఆరు బొట్లు నజీర్ ని తప్పించడం కోసం వేచి ఉన్నాయి. నజీరుతో పాటు మరొక ఉగ్రవాది అబ్దుల్ మదానీ కూడా బెంగళూరు పేలుళ్ల కేసులో నిందితులు.
తాజాగా ఈనెల 18న జరిగిన ఘటనకు సంబంధించి కానిస్టేబుల్ ఇబ్రహీం డ్యూటీలో ఉన్నట్టుగా పోలీసు అధికారులు చెబుతున్నారు. పైగా డ్రైవర్లు విధినిర్వహణ సమయంలో యూనిఫామ్ ధరించాలన్న నియమం లేదని అంటున్నారు.
ఇదిలా ఉండగా నిరసన, ఆందోళనలకు సంబంధించి పోలీసులు విడుదల చేసిన 210 మంది నిందితుల జాబితాలో 167వ పేరు ఇబ్రాహీం కుట్టీదే. అనంతరం పోలీసులు దాన్ని పొరపాటుగా పేర్కొంటూ తొలగించడం కూడా జరిగింది.
ఇబ్రహీం కుట్టీ అనుమానాస్పద తీరు, గతంలో అతడి నేర చరిత్ర గమనిస్తే క్రమశిక్షణతో శాంతియుతంగా జరుగుతున్న నిరసనలను ఉద్దేశపూర్వకంగా భగ్నం చేసి విధ్వంసానికి కుట్ర జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా కేరళ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఇస్లాం అతివాదులతో కలిసి అనేక మంది హిందువులను, ఆరెస్సెస్ కార్యకర్తలను హత్యచేసిన ఉదంతాలు ఉన్నాయి.
తాజా ఘటనలో జ్యుడిషియల్ విచారణ జరిపితే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Source: VSK Bharat