Home News ఏబీవీపీ జాతీయ వార్షికోత్సవ సమావేశాలు ప్రారంభం 

ఏబీవీపీ జాతీయ వార్షికోత్సవ సమావేశాలు ప్రారంభం 

0
SHARE
అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ 64వ జాతీయ సమావేశాలు అహ్మదాబాదులో ప్రారంభమయ్యాయి. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి సమక్షంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఏఎస్ కిరణ్ కుమార్ సమావేశాలను ప్రారంభించారు.

సమావేశాల ప్రారంభోపన్యాసంలో భాగంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఇస్రో సాధించిన ఘనవిజయాలను ప్రస్తావించారు. దేశ నిర్మాణం కోసం యువత ముందుకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తుని ప్రశంసిస్తూ లేఖ ద్వారా తన సందేశం పంపించారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ఏబీవీపీ చేస్తున్న కృషిని ప్రధాని కొనియాడారు.
ఈ సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి తన విద్యార్థి దశనాటి జ్ఞాపకాలకు కార్యకర్తలతో పంచుకున్నారు. తాను మొదట ఏబీవీపీ కార్యకర్తనే అని, ఆ తరువాతే ముఖ్యమంత్రిని అయ్యానని విజయ్ రూపాణి తెలిపారు.
డిసెంబర్ 27 నుండి 30వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా 3,700 మంది ఏబీవీపీ కార్యకర్తలు హాజరుకాగా, నేపాల్ నుండి 45 మంది హాజరయ్యారు. దేశంలోని సామాజిక, విద్యావిధానపరమైన అంశాలపై సమావేశాల్లో చర్చిస్తారు.