Home News మందిర నిర్మాణం దిశగా సకారాత్మక అడుగు

మందిర నిర్మాణం దిశగా సకారాత్మక అడుగు

0
SHARE

రామమందిర నిర్మాణం గురించి నేడు ప్రధానమంత్రి చేసిన ప్రకటన ఆ దిశగా సకారాత్మక అడుగుగా కనిపిస్తోంది. అయోధ్యలో భవ్యమైన శ్రీ రామమందిర నిర్మాణం గురించి సంకల్పాన్ని ప్రధాని తన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకోవడం పాలంపూర్ సమావేశాల్లో (1989)బిజెపి ఈ విషయంలో చేసిన తీర్మానానికి అనుగుణంగా ఉంది. రామమందిర నిర్మాణం కోసం చర్చల ద్వారా కానీ, చట్టం ద్వారా కానీ తగిన ప్రయత్నం చేస్తామని బిజెపి ఆనాటి తీర్మానంలో పేర్కొంది.

2014 సంవత్సరం శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో కూడా  రామమందిర నిర్మాణం కోసం రాజ్యాంగ పరిధిలోని అన్ని మార్గాలలో ప్రయత్నం చేస్తామని బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. ఈ వాగ్దానాలపై నమ్మకం ఉంచిన ప్రజలు భారీ మెజారిటీతో బిజెపికి పట్టం కట్టారు. ప్రస్తుత పాలనా కాలంలోనే ఆ వాగ్దానాలను నెరవేర్చాలని ప్రజలు ఆశిస్తున్నారు.

దత్తాత్రేయ హోసబళే, సహ సర్ కార్యవాహ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

Source: www.rss.org