2 జనవరి 2019, న్యూ ఢిల్లీ: రామజన్మభూమి విషయమై గౌరవనీయ ప్రధాని చేసిన ప్రకటన చూసాము. 69 ఏళ్లుగా రామజన్మభూమి కేసు కోర్ట్ లలో నానుతూనే ఉంది. దీనిపై అనేక అప్పీళ్ళు 2011 నుంచి సుప్రీం కోర్ట్ లో ఉన్నాయి. ఇది చాలా సుదీర్ఘమైన నిరీక్షణ. అక్టోబర్ 29,2018న విషయం కోర్ట్ ముందుకు వచ్చింది. కానీ అప్పటికి దానిని విచారించాల్సిన బెంచ్ ఏర్పాటు కాలేదు. అందువల్ల ప్రధాన న్యాయమూర్తి దీనిని పరిశీలించారు. విచారణ త్వరగా పూర్తిచేయాలన్న విజ్ఞప్తులను కోర్ట్ మన్నించలేదు. విచారణను 2019 జనవరి మొదటి వారానికి వాయిదా వేస్తూ, అప్పుడే “సంబంధింత బెంచ్ విచారణ తేదీ నిర్ణయిస్తామంటూ” కోర్ట్ స్పష్టం చేసింది.
ఇప్పుడు 4 జనవరి, 2019న కూడా కేసు “సంబంధింత బెంచ్” ముందుకు కాకుండా, మళ్ళీ ప్రధాన న్యాయమూర్తి ముందుకే వస్తున్నది. గత కొన్ని అప్పీళ్ల సమయం కోర్ట్ ఆఫీస్ రిపోర్ట్ “చనిపోయిన పిటిషనర్ల చట్టబద్ధ వారసుల వివరాలను సమర్పించలేదు” అని నమోదు చేసింది. అలాగే సరైన బెంచ్ ను ఏర్పాటు చేయలేదు. కొన్ని అప్పీళ్లలో పూర్తిచేయవలసిన కోర్ట్ పద్దతులు పూర్తికాలేదు. ఇలాంటి స్థితిలో విచారణ తేదీ దగ్గర పడింది.
ఈ మొత్తం పరిస్థితిని చూసిన తరువాత కోర్ట్ నిర్ణయం కోసం హిందూ సమాజం అనంతకాలం ఎదురుచూస్తూ ఉండలేదని విశ్వహిందూ పరిషత్ మరోసారి స్పష్టం చేస్తోంది. అందుచేత రామజన్మభూమి మందిర నిర్మాణానికి చట్టం చేయడం ఒక్కటే మార్గం. ఈ డిమాండ్ ను సాధించడానికి విశ్వహిందూ పరిషత్ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. అలాగే 31జనవరి లో ప్రయాగరాజ్ లో జరిగే కుంభమేళా సందర్భంగా జరిగే ధర్మ సంసద్ లో భవిష్య కార్యాచరణను సాధుసంతులు నిర్ణయిస్తారు.
– ఆలోక్ కుమార్, అడ్వకేట్, కార్యనిర్వహణ అధ్యక్షుడు, విశ్వహిందూ పరిషత్
Source: VSK Bharat