Home News శబరిమల పవిత్రత కాపాడుకుందాం: విశ్వహిందూ పరిషద్ పిలుపు   

శబరిమల పవిత్రత కాపాడుకుందాం: విశ్వహిందూ పరిషద్ పిలుపు   

0
SHARE
05 జనవరి 2019, శనివారం రోజు సాయంత్రం 06:00 గంటల నుండి తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలలో భక్తులు దీపాలు వెలిగించి,అయ్యప్ప స్వామి కోటి దీపోత్సవాన్ని నిర్వహించి శబరిమల పవిత్రత కాపాడటానికై ప్రతిజ్ఞ తీసుకొవాలని విశ్వహిందూ పరిషద్, శబరిమల సంరక్షణ సమితి, శబరిమల అయ్యప్ప సేవా సమితి, శబరిమల ఐక్యవేదిక తదితర ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలు పిలుపునివ్వడం జరుగుతుంది.
కేరళ ప్రభుత్వాన్ని రద్దుచేయాలి – ఇస్లామిక్ తీవ్రవాద భావజాలం కలిగిన సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మరియు మరియు హిందూ వ్యతిక జాకోబైట్ సిరియన్ చర్చిలతో కలిసి ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుట్రలకు పాల్పడుతూ, శబరిమల ఆలయ సాంప్రదాయాలు దెబ్బతీస్తూ, కేరళ హిందువులపై అత్యంత పాశవికంగా దాడులకు పాల్పడుతున్న , హిందువులను హత్య చేస్తున్న కేరళ కమ్యూనిష్టు ప్రభుత్వాన్ని వెంటనే రద్దుచేయాలని దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని విశ్వహిందూ పరిషద్ పిలుపునిస్తోంది. శబరిమలలో అయ్యప్ప స్వాములపై అక్కడి ప్రభుత్వం అమానుషంగా లాఠీచార్జీలు చేస్తూ ప్రతిరోజూ వందలాది మంది భక్తుల రక్తాన్ని పారిస్తోందని, అనేకమంది తెలుగు రాష్ట్రాల అయ్యప్ప స్వాములు తీవ్రంగా గాయపడినప్పటికీ సెక్యులర్‌ ముసుగులు ధరించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటు అని, ప్రతి హిందువు మొద్దునిద్ర వదిలి, సెక్యులర్ ముసుగులో ధర్మంపై, దేశంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని విశ్వహిందూ పరిషద్ పిలుపునిస్తోంది
– రావినూతల శశిధర్, 
విశ్వహిందూ పరిషద్ తెలంగాణ అధికార ప్రతినిధి.