సరస్వతి శిశుమందిర్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా హైదరాబాదు జరిగిన కార్యక్రమంలో కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రాంత అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణుగోపాలాచారి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి చాటువుతో పాటుగా ఏదైనా ఒక క్రీడలో ప్రావీణ్యం సంపాదించటం ద్వారా మానసిక ఎదుగుదలలో పాటు శారీరిక దృఢత్వాన్ని కూడా సాధించవచ్చునని తెలిపారు. ఈ అంశంలో సరస్వతి శిశుమందిర్ విద్యాసంస్థలు చేస్తున్న కృషిని వేణుగోపాలాచారి ప్రశంసించారు.
ఇదే కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ సరస్వతి శిశుమందిర్ నిర్వహించే ఇటువంటి ఉపయోగకరమైన కార్యక్రమాలకు తాను ఏ విధంగా చేయూతనివ్వడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. విద్యావికాసం అంటే కేవలం పాఠాలు మాత్రమే కాదని.. కళలు, క్రీడలు వంటి రంగాల్లో కూడా ప్రవేశం పొందినప్పుడే విద్యార్థి అసలైన వికాసం సాధిస్తాడని అన్నారు.
కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి పాల్గొని క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు అన్ని రంగాల్లోనూ ఎదగాలంటే ఏం బోధించాలి అనే విషయంలో శిశుమందిర్ శిశుమందిర్ గ్రహించి అందుకు అనుగుణంగా ఆచరణలో పెట్టడం గొప్ప విషయం అన్నారు.
కార్యక్రమంలో శిశుమందిర్ విభాగ్ కార్యదర్శి యుగందర్ రెడ్డి, భాగ్యనగర్ విభాగ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, శిశుమందిర్ పాఠశాలల అధ్యక్షులు డాక్టర్ సుదర్శన్ రెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఖేల్ ఖూద్ పోటీలు:
మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల విభాగ్ ‘ఖేల్‌కూద్’ పోటీలు బండమీదిపల్లి శిశుమందిర్ మైదానంలో జరిగాయి. కబడ్డీ, పరుగు, హైజంప్, లాంగ్‌జంప్, త్రోబాల్, ఖోఖో పోటీలలో విజేతలుగా నిలిచినా శిశుమందిర్ విద్యార్థులకు సాయంత్రం బహుమతి ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమంలో న్యాయవాది మనోహర్‌రెడ్డి, వీహెచ్‌పీ జిల్లా గౌరవాధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, సంగ విశ్వనాథ్, పట్లోళ్ల లక్ష్మారెడ్డి, భాజపా నేత శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
సరస్వతి శిశు మందిరాలు చక్కని విద్యనందించటమే కాకుండా విద్యార్థుల్లో ఉన్నత విలువలు, హైందవ సంస్కృతి సాంప్రదాయాలు, మాతృమూర్తులను గౌరవించే సంస్కృతిని నేర్పించటం గొప్పదన్నారు.
ఆదిలాబాద్ జిల్లాల్లో ఖేల్ ఖూద్ పోటీలు:
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఖేల్ ఖూద్ పోటీలు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో జరిగాయి. ఖోఖో, కబడ్డీ, లాంగ్ జంప్, పరుగు పందెం విభాగాలలో జరిగిన పోటీల్లో ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఇండోర్ క్రీడల విభాగంలో క్యారెమ్స్, చెస్ పోటీలు నిర్వహించారు. బహుమతుల ప్రదానోత్సవంలో పాఠశాల కమిటీ సభ్యులు చిలువేరు వెంకన్న, గుండా బాలేశ్వర్, జిలా ట్రస్ట్ అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.