Home News రామజన్మభూమి అంశంలో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంపై విశ్వహిందూ పరిషత్ ప్రకటన

రామజన్మభూమి అంశంలో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంపై విశ్వహిందూ పరిషత్ ప్రకటన

0
SHARE
రామజన్మభూమి అంశంలో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంపై విశ్వహిందూ పరిషత్ స్వాగతిస్తోంది.
ఈ అంశానికి సంబంధించి 67.703 ఎకరాల భూమిని 1993లో కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే ఇందులో వివాదానికి సంబంధం లేని భూమి కూడా ఉండటం వలన కేంద్ర ప్రభుత్వం తాజాగా అభ్యర్ధన పిటిషన్ దాఖలు చేసింది.
ఈ 67.703 ఎకరాల భూమిలో శ్రీరామజన్మభూమి న్యాస్ ట్రస్ట్ సంస్థకు చెందిన స్థలం కూడా ఉండటం విశేషం. వివాదంలో లేని తమ భూమి తమకు కేటాయించాలంటూ రామజన్మభూమి న్యాస్ ట్రస్ట్ తమను కోరుతోందని కేంద్రం తమ పిటిషన్ లో  పేర్కొంది.
గతంలోని ఎం. ఇస్మాయిల్ కేసులో తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు వివాదంలో లేని స్థలాన్ని అసలు యజమానులకు ఇవ్వాల్సిందిగా పేర్కొనడాన్ని విశ్వహిందూ పరిషత్  తమ పిటిషన్ లో  ప్రస్తావించింది.
ప్రస్తుతం కేంద్రం దాఖలు చేసిన అభ్యర్ధన పిటిషన్ మీద సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటుందని   పరిషత్ ఆశాభావం వ్యక్తం చేసింది.
– అలోక్ కుమార్, అడ్వొకేట్
అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు,
విశ్వహిందూ పరిషత్ .