Home News దేశ అఖండతను గౌరవించే వారికి, దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్న వారి మద్య జరుగుతున్న 2019...

దేశ అఖండతను గౌరవించే వారికి, దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్న వారి మద్య జరుగుతున్న 2019 ఎన్నికలు – నరేంద్ర మోడీ

0
SHARE

హైదరాబాద్ లోని ఎల్ బి స్టేడియంలో ఏప్రిల్ 1 నాడు జరిగిన  భారతీయ జనత పార్టీ అద్వర్యంలో నిర్వహించబడిన  “విజయసంకల్ప సభ”లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ప్రధాన మంత్రి మాట్లాడుతూ దేశంలో ఇప్పుడు ఎన్నికలు కీలకమైనవి అని ప్రముఖంగా దేశ అఖండను గౌరవించే వారికి దేశాన్ని ముక్కలు చేయడానికి జరుగుతున్న రాజకీయ శక్తుల మద్య జరుగుతున్నాయన్నారు.

దేశ సైనికుల అవసరాలను విస్మరించిన పార్టీలు నేడు మరొకసారి ఓట్ల గురుంచి ప్రజల మధ్యకు వస్తున్నాయి. ఈ విషయాలను గుర్తించి దేశ భద్రతను పటిష్ట పరిచే శక్తులకు ఓటు వేయాలని యువతరానికి పిలుపునిచ్చారు.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ పాలన ఓటు బ్యాంకు, కుటుంబ కేంద్రంగా జరుగుతున్నదని నిజమైన అభివృద్ధి పట్ల టి ఆర్ ఎస్ పార్టీ కి ఎలాంటి అవగాహన లేదని విమర్శించారు.  ప్రభుత్వం చేసిన  ట్రిపుల్ తలాక్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన ఎం.ఐ.ఎం పార్టీ కి వత్తాసు పలకడం, టి ఆర్ ఎస్ ప్రభుత్వం స్టీరింగ్ ఎం.ఐ.ఎం చేతిలో ఉండడం వలన జరిగే నష్టాలను గ్రహించాలని ఓటర్లను కోరారు.

ప్రజల అభివృద్ధి పట్టించుకోని, అడ్డగించే పార్టీ అయిన మజ్లిస్‌తో సావాసం వల్ల తెరాస కూడా పాతబస్తీ ప్రజల్ని పట్టించుకోవడంలేదన్నారు. కారు తెరాసదే అయినా.. స్టీరింగ్‌ మాత్రం మజ్లిస్‌ చేతుల్లోనే ఉంటుందని ప్రధానమంత్రి ఆరోపించారు.

కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న నేషనల్ కాన్ఫెరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా దేశంలో ఇద్దరు ప్రధాన మంత్రులు కావాలని, కాశ్మీర్ కు ప్రత్యేక ప్రధాన మంత్రి కావాలి అని  డిమాండ్ చేస్తున్న వ్యక్తి పట్ల కాంగ్రెస్ కూటమి లోని ప్రతి పార్టీ సమాధానం ఇవ్వాలి అని వారి డిమాండ్ చేశారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో జట్టు కట్టిన కాంగ్రెస్‌, తెదేపా, జనతాదళ్‌, తృణమూల్‌ కాంగ్రెస్ నేతలు మమతా బెనర్జీ, చంద్రబాబు, దేవెగౌడ ఆయా రాష్ట్రాల ప్రజల దేశ ప్రజలకు సమాధానం ఇవ్వాలని కోరారు.

వేలాది మంది పాల్గొన్న ఈ కార్యక్రమలో భా జ పా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యకుడు లక్ష్మణ్, పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు.