Home News తప్పుడు సమాచారం వ్యాప్తి ద్వారా కరీంనగర్ పట్టణంలో మత ఉద్రిక్తతలకు కుట్ర!

తప్పుడు సమాచారం వ్యాప్తి ద్వారా కరీంనగర్ పట్టణంలో మత ఉద్రిక్తతలకు కుట్ర!

0
SHARE

కరీంనగర్ పట్టణంలో మతఘర్షణలు సృష్టించడానికి చేసిన ప్రయత్నాన్ని భగ్నం చేసిన పోలీసులు

కరీంనగర్ పట్టణానికి చెందిన ఒక ముస్లిం యువకుడు గత కొంతకాలంగా  ప్రేమ పేరిట ఒక హిందూ అమ్మాయి వెంటపడటం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి తరఫున పెద్దలు అతడిపై దాడి చేశారు. 

ఇది జరిగిన వెంటనే  ఆలిండియా మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఐఎంఐఎం) మాజీ నాయకుడు, ప్రస్తుతం మజ్లీస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) సభ్యుడు అంజద్ ఉల్లాఖాన్ ఘటనను మతం కోణంలో చూపిస్తూ.. “జై శ్రీరామ్ అననందుకు ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలు ముస్లిం యువకుడిని చితకబాదారని, కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గెలిచినప్పటి నుండి ఇది రెండవ మత ఉద్రిక్త ఘటన” అని ట్వీట్ చేసి తప్పుడు సమాచారం వ్యాప్తికి ప్రయత్నం చేసారు. 

https://twitter.com/amjedmbt/status/1134637484329955328

నిజానిజాలు నిర్ధారించుకోకుండా మరికొందరు ఎంబీటీ మరియు ముస్లిం వర్గానికి చెందిన ట్విట్టర్ ఖాతాదారులు అంజద్ ఉల్లాఖాన్ చేసిన ట్వీట్ ని కాపీ పేస్ట్ చేసి వ్యాప్తి చేయడం మొదలుపెట్టారు. 

దీంతో అప్రమత్తమైన కరీంనగర్ పోలీస్ కమిషనర్ యువకుడి వీడియో క్లిప్పింగ్ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో యువకుడు స్వయంగా ఇది మతపరమైన ఘటన కాదని, ప్రేమ పేరిట యువతిని వేధిస్తుండటం వల్లనే తనను కొట్టినట్టు స్పష్టంగా పేర్కొన్నాడు. 

పోలీసులు విడుదల చేసిన వీడియోలో యువకుడి తండ్రి కూడా కనిపించి, ఇది మతపరమైన అంశం కాదని, తమ కొడుకు చేసిన పొరపాటు కారణంగానే ఇదంతా జరిగినట్టు తెలియజేసారు. 



ఇటీవల గురుగావ్ పట్టణంలో జరిగిన ఘటనను ఈ ఘటనకు ముడిపెట్టి, మత ఉద్రిక్తతలు సృష్టించాలని చేసిన ప్రయత్నాన్ని ఈ విధంగా కరీంనగర్ పోలీసులు తిప్పికొట్టారు.