Home News నిబద్దత, స్వీయ నియంత్రణ కలిగిన పాత్రికేయులే సమాజానికి హితం

నిబద్దత, స్వీయ నియంత్రణ కలిగిన పాత్రికేయులే సమాజానికి హితం

0
SHARE

ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో పాత్రికేయులది విశిష్టమైన పాత్ర అని, వారి నిర్వహించే సమాచార వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఉంది, అలాంటి వ్యవస్థలో పని చేస్తున్న పాత్రికేయులకు నిబద్దత, స్వీయ నియంత్రణ చాల అవసరమని, వారి రచనలు సమాజ హితమే లక్షంగా ఉండాలి అని శ్రీ అప్పాల ప్రసాద్, తెలంగాణా & ఆంధ్ర ప్రదేశ్ సామజిక సమరసత వేదిక కార్యదర్శి, కోరారు.

సమాచార భారతి ఇందూర్ శాఖ అద్వర్యంలో శనివారం ఇందూర్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన దేవర్షి నారద జయంతి (ప్రపంచ పాత్రికేయ దినోత్సవం) కార్యక్రమం లో శ్రీ అప్పాల ప్రసాద్ ముఖ్య అతిధిగా ప్రసంగించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రంథాలయ కార్యదర్శి శ్రీ బుగ్గ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మంచి చెడు ఉన్నాయని, కాబట్టి పాత్రికేయులు లోకహితమైన దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించాలన్నారు. 

ఈ కార్యక్రమంలో జర్నలిస్టులతోపాటు  నగర తపాలశాఖకు చెందిన పలువురు ఉద్యోగాలను సన్మానించడం విశేషం.        కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా జాగృతి వార పత్రిక సహా సంపాదకులు శ్రీ దుర్గా రెడ్డి , తపాలాశాఖ సహా పర్యవేక్షకులు రాజ నర్సాగౌడ్, డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, వకుళాభరణం రామ్ నరేష్, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.