Home News ప.పూ. సరసంఘచాలక్ జి తృతీయ వర్ష ఉద్బోధన (నాగపూర్)

ప.పూ. సరసంఘచాలక్ జి తృతీయ వర్ష ఉద్బోధన (నాగపూర్)

0
SHARE

సంఘ శిక్షవర్గ తృతీయ వర్ష సమారోప్ కార్యక్రమంలో పూ.సరసంఘచాలక్ డా.మోహన్ భాగవత్ గారి ఉపన్యాసంలోని ముఖ్యాంశాలు …

ఎన్నికల తరువాత ఈ వర్గ జరుగుతోంది, ఐదేళ్ల క్రితం 2014 లో కూడా ఇలాగే జరగడం ఒక విశేషం కాగా రెండు సార్లూ హిందుసామ్రాజ్య దినోత్సవం మరుసటి రోజు ఈ వర్గ ముగియడం ఇంకొక విశేషం

ఎన్నికలలో పూతి ఉంటుంది , ప్రజస్వామ్యం కనుక ఎన్నికలు విధిగా జరుగుతాయి. ఆ ఎన్నికల వాతావరణం చాలా  హడావిడిగా ,వాడి వేడిగా ఉంటుంది. కొన్ని సార్లు భేదాభిప్రాయలు కూడా ఏర్పడతాయి . కొంతమందే గెలుస్తారు మిగిలినవారు ఓడుతారు ఇది సహజమైన విషయం.క్రిందటి సారి గెలిచినవారే ఈ సారీ మరింత ఆధిక్యతతో గెలుపొందారు. బహుశా వాళ్ళ పని తీరు నచ్చిందేమో , సమాజం మరొక అవకాశాన్నిఇచ్చింది . కొన్ని ఆశలు నెరవేరాయి కొన్ని ఇంకా తీరాల్సి  ఉంది. మరొక అవకాశం ఇస్తే మిగిలిన ఆశలు నెరవేరుస్తారని సమాజం విశ్వసించింది.అందుకనే వారి ఆధిక్యత పెరిగింది. వాళ్ళు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ఆశలు త్వరగా నెరవేర్చే అదనపు భారం వాళ్ళ మీద ఉంది. దేశంలో ప్రజలు బాగా నేర్చుకుంటున్నారు , స్వార్థం భేదాలను పక్కనపెట్టి లౌక్యం మరియు దృఢత్వంతో ,దేశ ఏకాత్మత, అఖండతను , మరియు దేశాభివృద్ధిని అలాగే ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకతను అందించే వారి వైపు తమ ఓటును వినియోగించారు. ప్రచారంలో ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా , తీయని మాటలు మాట్లాడినా ఇక ప్రజల్ని ఎవ్వరూ భ్రమింపజేయ్యలేరు ఇది ఒక శుభ శకునం. ప్రతి ఎన్నికలలోనూ ప్రజలు మరింత నేర్చుకుంటున్నారు. లౌక్యంతో దేశ ఏకాత్మతను అఖండతను దృష్టిలో ఉంచుకొని వ్యవహరిస్తున్నారు.

ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి ఇక అందరూ కలసి దేశం కోసం పని చెయ్యాలి ఎందుకంటే ఎన్నికలు కేవలం ఒక పోటీ మాత్రమే. గెలుపోటములు పూర్తయ్యాయి ఏది జరగాలో అది జరిగింది. “దేశ ,ధర్మ రక్షణ కోసం కలిసి పనిచేద్దాం” ఇది కేవలం స్వయంసేవకులకు మాత్రమే కాదు సమస్త సమాజానికీ వర్తిస్తుంది. గెలిచిన వాళ్ళు విజయోత్సాహంలో, ఓడినవారు ఓటమిని  జీర్ణించుకోలేక అమర్యాదతో ప్రవర్తిస్తే అది దేశానికి నష్టం చేస్తుంది. ఈరోజున బెంగాల్ లో ఏదైతే జరుగుతోందో ఎన్నికల తరువాత దేశంలో ఎక్కడైనా ఇలా జరిగిందా ,ఏదైనా ప్రాంతలో జరుగుతోందా ,ఇలా జరగకూడదు , ఒకవేళ హింసాప్రవృత్తి ఉన్నవాళ్ళు ఇలా చేస్తూంటే ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళని కట్టడి చెయ్యాలి, వాళ్ళని వదిలిపెట్టకూడదు.

సామాన్య ప్రజలలో అవివేకులు ఉంటారు , అమర్యాదగా ప్రవర్తించే అవకాశం ఉంది కనుక దేశ ఏకాత్మత మరియు అఖండతను దృష్టి లో ఉంచుకొని న్యాయ వ్యవస్థను నిలబెట్టడానికి దండ శక్తి తో వ్యవస్థ నిర్మించాలి. ఒక అనుభవజ్ఞుడు , సంఘర్షణ అనుభవం ఉన్న వ్యక్తి కేవలం కుర్చీకోసం , అధికారం కోసం ఇటువంటివి చేస్తుంటే అది తప్పు ఆలా చేయకూడదు.  రాజ్యాంగ సభ లోని తన ఉపన్యాసంలో డా.భీంరావ్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు మాట్లాడుతూ మనల్ని ఏ విదేశీయుడూ వాళ్ళ శక్తి తో ఓడించలేదు మనలోని భేదాలే వాళ్ళకి సహాయకారి అయ్యాయి వాటి వల్లే మనం పరాధీనంలోకి వెళ్ళమని హెచ్చరించారు. ఒక మనిషికి వ్యక్తిగత శీలం ఎంత శుద్ధంగా ఉండాలో అలాగే జాతీయ శీలం కూడా అంటే శుద్ధంగా ఉండాలి. కవాతు సహజంగా ఉంటుంది కానీ అందరితో కలిసి అందరినీ కలుపుతూ ఒకే లయలో సాగడమే జాతీయ శీలం. ఎప్పుడైనా తప్పు అడుగు వేస్తే దాన్ని సరిదిద్దుకుని నడవాలి సంఘ ఇదే నేర్పుతుంది

భారత్ ముందుకెళుతోంది ,హిందువు ముందుకెళ్తుతున్నాడు దీని అర్థం ఏమిటంటే తమ స్వార్థం చూసుకునే వాళ్ళ మార్గాలు మూసుకుంటాయి.

ఈరోజున దేశం పురోగమిస్తోంది దీనికి అడ్డంకి కలిగించాలనే శక్తులు ఇది కోరుకోవట్లేదు, మన హిందూ సమాజం ,భారతీయ సమాజం పురోగమిస్తే ప్రపంచంలోని స్వార్థ ప్రయోజన కారి దుకాణాలు మూత పడతాయి. వ్యక్తిత్వం ప్రేరణనిచ్చే అంశం. ఏకపత్నీవ్రతాన్ని ఆచరించిన శ్రీరాముడు , 16108 మంది స్త్రీలను రక్షించిన శ్రీకృష్ణుడు మన ఆదర్శాలు. మనం ఎంత పరాక్రమవంతులమైనా మన పరతంత్ర కాలంలో కూడా మన వద్ద గుణవంతులు ఉన్నారు కాని వ్యక్తిగత శీలం తో పాటు జాతీయ శీలం కూడా అవసరం.వివిధత్వంలో ఏకత్వాన్ని జరుపుకోవడం , బంధుభావనే  మానవత్వం . సమాజంలో బంధుభావన నిర్మాణానికి మనం ప్రయత్నం చెయ్యాలి . భారత్ బలపడింది కనుకనే ఇతర దేశాల నుండి మనకి మద్దతు లభిస్తోంది.

కార్యక్రమంలో విశేష అతిథులుగా పూ.చిరన్తంజీ మహారాజ్ (అగర్తలా),డా.కృష్ణస్వామి (కోయింబత్తోర్),శ్రీ శ్రీనివాస్ (గోవా),శ్రీ గోపాలకృష్ణ (బెంగళూరు), retd. ఐ‌పి‌ఎస్ రమేశ్ చంద్ర గారు (జలంధర్), శ్రీ యశ్రాజ్ గారు మరియు శ్రీ యువరాజ్ గారు (ఢిల్లీ) పాల్గొన్నారు.