Home News ధ్యేయ సమర్పిత వ్యక్తిత్వం.. సుష్మా స్వరాజ్

ధ్యేయ సమర్పిత వ్యక్తిత్వం.. సుష్మా స్వరాజ్

0
SHARE

ఏమాత్రం ఊహించని, విశ్వసించలేకపోతున్న అత్యంత విచారకరమైన సమాచారం సుష్మా స్వరాజ్ హఠాన్మరణం. ఈ వార్త ఎంతో దుఃఖాన్ని కలిగిస్తోంది.

45 ఏళ్ల ఆమె సామాజిక, రాజకీయ జీవితం ఆదర్శవంతమైనది, అనుసరించదగినది.

ఒక ఆదర్శ కార్యకర్త, కుశల నాయకురాలు, సమర్ధవంతురాలైన మంత్రిగా, ఆమె ధ్యేయ సమర్పిత వ్యక్తిత్వం మనకు ఎల్లప్పటికి జ్ఞాపకం ఉంటుంది.

మాతృసమానమైన ప్రేమ, దేశం, సమాజంలోని సమస్యలపట్ల స్పందించే సంవేదనశీలత, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలచి ముందుకు సాగగలిగిన దృఢత్వంతో ఆమె నిరంతరం పనిచేశారు.

ఆరోగ్యం దృష్ట్యా క్రియాశీల రాజకీయాలనుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న ఆమె సామాజిక కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొనాలని భావించారు. కానీ ఇంతలోనే ఆమె మరణం మన అందరినీ దుఃఖంలో ముంచివేసింది.

ఇటీవల దేశంలో జరిగిన చారిత్రక పరిణామాల పట్ల ఆమె ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. చివరి శ్వాస విడిచే ముందు తన సంతోషాన్ని మనందరితో పంచుకున్నారు. ఇలాంటి విశేషమైన మార్పులు జరుగుతున్న సమయంలో ఆమె మన మధ్యన లేకుండా స్వర్గవాసానికి వెళిపోవడం అత్యంత బాధాకరం. ఈ దుఃఖ సమయంలో ఆమె కుటుంబ సభ్యులందరికి హృదయపూర్వక సానుభూతి వ్యక్తం చేస్తున్నాము. ఈ విచారాన్ని తట్టుకునే శక్తి పరమేశ్వరుడు మనకు ప్రసాదించాలి. దివంగత ఆత్మకు తన పాదసన్నిధిలో స్థానం ప్రసాదించాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్ధిస్తున్నాము.

ఓం శాంతి, శాంతి, శాంతిః

డా. మోహన్ భాగవత్, సర్ సంఘచాలక్

సురేశ్ (భయ్యాజీ)జోషి, సర్ కార్యవాహ