Home News క్రిస్టియన్ కో-ఎడ్ విద్యాసంస్థలు ఆడపిల్లల భవిష్యత్తుకు ఏ మాత్రం సురక్షితం కావు : మద్రాస్ హైకోర్ట్

క్రిస్టియన్ కో-ఎడ్ విద్యాసంస్థలు ఆడపిల్లల భవిష్యత్తుకు ఏ మాత్రం సురక్షితం కావు : మద్రాస్ హైకోర్ట్

0
SHARE

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌కు జారీ చేసిన షో-కాజ్ నోటీసును రద్దు చేయడానికి నిరాకరించినప్పటికీ, క్రైస్తవ విద్యా సంస్థలలో సహ విద్య అధ్యయనం ఆడపిల్లల భవిష్యత్తుకు ఏ మాత్రం  సురక్షితం కాదనే  ఒక సాధారణ భావన సమాజంలో ఉందని మద్రాస్  హైకోర్ట్ అభిప్రాయపడింది.

క్రైస్తవ మిషనరీలు మంచి విద్యను అందిస్తున్నప్పటికీ, వారు భోదిస్తున్న నైతికత మాత్రం  మిలియన్ డాలర్ల ప్రశ్న అని మద్రాస్ హైకోర్టు శుక్రవారం అభిప్రాయపడింది.

మూడవ సంవత్సరం జువాలజీ కోర్సు చేస్తున్న కనీసం 34 మంది బాలికల నుండి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ (ఎంసిసి) ప్రొఫెసర్‌కు ఇచ్చిన షో-కాజ్ నోటీసును రద్దు చేయడానికి నిరాకరించిన న్యాయమూర్తి  ఎస్. వైద్యనాథన్ మాట్లాడుతూ…. విద్యార్థుల తల్లిదండ్రులలో, ముఖ్యంగా మహిళా విద్యార్థులలో క్రైస్తవ సంస్థలలో సహవిద్య అధ్యయనం వారి పిల్లల భవిష్యత్తుకు ఏ మాత్రం సురక్షితం కాదని ఒక సాధారణ భావన ఉంది  అని  అన్నారు.

ప్రస్తుత కాలంలో, ఇతర మతాల ప్రజలను, వారికి ఉన్న సమస్యలను ఆసరాగా చేసుకుని క్రైస్తవ మతంలోకి మార్చడం ఒక అలవాటుగా మార్చుకున్నారన్న అనేక ఆరోపణలు వారిపై ఉన్నాయని, వారు మంచి విద్యను అందిస్తున్నప్పటికి వారు భోదిస్తున్న నైతికత మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది అని న్యాయమూర్తి అన్నారు.

తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదును విచారించి పర్యవసానంగా తనపై కమిటీ ఆఫ్ ఎంక్వైరీ (అంతర్గత ఫిర్యాదుల కమిటీ) మే 24 2019 న జారీ చేసిన రెండవ షో-కాజ్ నోటీసును రద్దు చేయాలని టెన్నిసన్ కోర్టును ఆశ్రయించారు.

ఈ ఏడాది జనవరిలో మైసూరు, బెంగళూరు, కూర్గ్ లకు విద్యా పర్యటన కోసం వెళ్ళినపుడు ఈ వేధింపులు జరిగాయి. అయితే, అంతర్గత ఫిర్యాదుల కమిటీ తన రక్షణ కోసం ఉపయోగించాలని కోరిన కొన్ని పత్రాలను, స్టేట్మెంట్లను తనకు అందించలేదని టెన్నిసన్ పేర్కొన్నప్పటికీ  విచారణ కమిటీ, కళాశాల కమిటీ తనను తాను రక్షించుకోవడానికి ఫిర్యాదుదారునికి తగిన అవకాశం ఇచ్చినట్లు తెలిపాయి.

అసిస్టెంట్ ప్రొఫెసర్ తనకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ పత్రాలు, స్టేట్మెంట్లు ఇవ్వలేదని పేర్కొన్నప్పటికీ, విచారణ కమిటీ తేల్చిన విషయాలు,  టెన్నిసన్ కు జారీ చేసిన  రెండవ షో-నోటీసు రెండింటిలోనూ జోక్యం చేసుకోవడానికి న్యాయమూర్తి నిరాకరించారు.

ఇంకా న్యాయమూర్తి మాట్లాడుతూ కోర్టు కమిటీ విచారణ ద్వారా న్యాయాన్ని కనుగొంటుంది. న్యాయస్థానం అభిప్రాయం ప్రకారం, విచారణలో భాగంగా  కమిటీ ఏ విధమైన సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘనకు పాల్పడలేదని,  కోర్టుకు ఇచ్చిన  నివేదికలో లోపాలేవీ లేవని అన్నారు.

అయితే  అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు తగినంత సమయం  లభించిందని కళాశాల, కోర్ట్  విచారణా కమిటీ నిర్ధారించాయి. అలాగే మహిళల భద్రతకు సంబందించి నిజమైన వారిని శిక్షించి, అమాయక పురుషులను రక్షించడానికి చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. అమాయక మగవారిపై చట్టాల దుర్వినియోగం నిరోధించడానికి ప్రభుత్వం ఆ చట్టాలలో తగిన సవరణ గురించి ఆలోచించడానికి ఇదే సరైన సమయం అని కోర్ట్ అభిప్రాయపడింది.

ఈ సందర్భంగా,  ఇటువంటి ప్రయోజనకరమైన చట్టాలను మహిళలు నిజమైన కారణాల కోసమే ఉపయోగించుకుంటున్నారా అని  న్యాయమూర్తి  ఆశ్చర్యం వ్యక్తం చేసారు. మగ వారికి  ఒక పాఠం నేర్పించాలనే పట్టుదలతో మహిళలు పనికిరాని,తప్పుడు కేసులను నమోదు చేస్తారని వాటిని అడ్డుకోవడం కష్టమని చెపుతూ, కొన్ని చట్టాలు అలా దుర్వినియోగం అవుతాయని ఆయన అన్నారు.

వరకట్న వ్యతిరేక చట్టం (498-ఎ) విషయంలో ఇలాంటి ధోరణి ఇప్పటికే మొదలైందని, ఈ చట్టం ఇప్పటికే  దుర్వినియోగం అవుతోందని,  దీనిని చట్టబద్దమైన ఉగ్రవాదం అని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని  జస్టిస్ వైద్యనాథన్ అన్నారు.

(పి.టి.ఐ సహకారంతో)