Home News సి.ఏ.ఏ వ్యతిరేక ప్రదర్శనలకు పి.ఎఫ్.ఐ నిధులు, నిజానిజాలను బయటపెట్టిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్

సి.ఏ.ఏ వ్యతిరేక ప్రదర్శనలకు పి.ఎఫ్.ఐ నిధులు, నిజానిజాలను బయటపెట్టిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్

0
SHARE

దేశవ్యాప్తంగా సిఎఎ కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రదర్శనలకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరిపిన దర్యాఫ్తులో అనేకమంది ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి. ఈ ప్రదర్శనలకు మూలంగా భావిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి ఎఫ్ ఐ) 73మంది ప్రముఖులకు చెందిన అకౌంట్లలో 120కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్ చేసినట్లు దర్యాప్తులో తేలింది.

ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన సి ఎ ఎ వ్యతిరేక ప్రదర్శనలతో పి ఎఫ్ ఐ కి నేరుగా సంబంధం ఉన్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తేల్చింది. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలకు చెందినవారి అకౌంట్లలోకి పి ఎఫ్ ఐ పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేయడం ఈ విషయాన్ని దృవీకరిస్తోంది. డిసెంబర్ లో పార్లమెంట్ సి ఎ ఎ ను ఆమోదించిన వెంటనే ఈ డబ్బు ఈ ప్రాంతాలకు చేరిందని దర్యాప్తులో తేలింది.

పి ఎఫ్ ఐ అనుబంధ సంస్థ రెహబ్ ఇండియా ఫౌండేషన్ తో పాటు మరికొందరు వ్యక్తులకు 17 బ్యాంక్ లలో ఉన్న 73కు పైగా అకౌంట్లకు డబ్బు  వెళ్ళినట్లు ఈడీ దర్యాప్తులో బయటపడిందని టైమ్స్ నౌ న్యూస్ చానల్ కధనం ప్రసారం చేసింది. ఈ అకౌంట్ లలో డిపాజిట్ చేసిన 120 కోట్లు కేవలం రెండు, మూడు రోజుల్లోనే పూర్తిగా తీసుకోవడం జరిగిందని బ్యాంక్ వివరాలను బట్టి తెలుస్తోంది.

డబ్బును నేరుగా అకౌంట్ లలో జమ చేశారు. పి ఎఫ్ ఐ కి చెందిన న్యూఢిల్లీ నెహ్రూ ప్లేస్ లోని సిండికేట్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఉత్తర్ ప్రదేశ్ బరైచ్, బిజ్ నూర్, హాపూర్, షామిల్, దాస్న తదితర ప్రాంతాలలోని అకౌంట్ లకు 41కోట్లకు పైగా డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ప్రాంతాలలోనే ఎక్కువగా హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి.

ప్రముఖుల ఖాతాలలోకి….

కొందరు ప్రముఖుల ఖాతాలలోకి పి ఎఫ్ ఐ, దాని అనుబంధ సంస్థల నుంచి డబ్బు డిపాజిట్ అయ్యిందని ఈడీ దర్యాప్తులో తేలింది. కేరళ కోజీకోడ్ లోని సిండికేట్ బ్యాంక్ మయూర్ రోడ్ బ్రాంచ్ లోని 4405010004277 నంబర్ కలిగిన పి ఎఫ్ ఐ కి చెందిన అకౌంట్ నుంచి పెద్ద్ మొత్తంలో డబ్బు డిపాజిట్ అయిన ప్రముఖుల వివరాలు ఇలా ఉన్నాయి –
 

అలాగే దుబాయి లోని పి ఏం ఎ ఇంటర్నేషనల్ ఎల్ ఎల్ సి సంస్థకు చెందిన అకౌంట్ నుంచి పి ఎఫ్ ఐ అనుబంధ సంస్థ అయిన రెహబ్ ఇండియా ఫౌండేషన్ కు చెందిన అకౌంట్ కు 20 లక్షల రూపాయలు డిపాజిట్ అయినట్లు కూడా దర్యాప్తులో తేలింది. దుబాయి లోని పి ఏం ఎ సంస్థ కార్యకలాపాలు, వ్యాపారం గురించి దర్యాప్తు సాగుతోంది. పి ఎఫ్ ఐ నాయకుడు ఒకరికి ఉన్న థానల్ ఫౌండేషన్ అనే మత, సేవ సంస్థ పి ఎఫ్ ఐ కార్యకలాపాలకు పూర్తి అండదండలు ఇస్తోందని ఇంటలిజెన్స్ సమాచారం. కాశ్మీర్ లోని పి ఎఫ్ ఐ బ్రాంచ్ కు ఒకటిన్నర కోట్లకు పైగా నిధులు ముట్టినట్లు కూడా ఈడీ దర్యాప్తులో తేలింది.