ఈశాన్య ఢిల్లీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నిఘా విభాగం(ఐబీ)అధికారి అంకిత్‌శర్మ శరీరంపై 51చోట్ల గాయాలైనట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. వీటిలో 12చోట్ల పదునైన కత్తులతో చేసిన గాయలుకాగా మరో 33చోట్ల ఆయుధాలు, రాడ్లతో చేసిన గాయాలున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ గాయాలన్నీ అంకిత్‌శర్మ మరణించే కొంతసమయం ముందే అయినట్లు ఫోరెన్సిక్ నిపుణులు పేర్కొన్నారు. గత ఫిబ్రవరి 27న ఢిల్లీలోని చాంద్‌బాగ్ ప్రాంతంలో ఓ కాలువలో అంకిత్ శర్మ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అయితే, అత్యంతదారుణంగా జరిగిన ఈ హత్యలో స్థానిక నేత తాహిర్ హుస్సేన్ హస్తం ఉందంటూ అంకిత్‌శర్మ కుటుంబీకులు చేసిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసుకు సంబంధించి తాహిర్‌ను అరెస్టు చేసిన పోలీసులు, మూడు రోజుల కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు.
vskandhra సౌజన్యంతో…
మరిన్ని వార్తలు, విశేషాల కోసం Samachara Bharati యాప్ ను క్లిక్ చెయ్యండి.