వీర్ సావర్కర్ అసలు ఎవరు?
- అంతర్జాతీయ స్థాయిలో భారత స్వాతంత్ర్యం కోసం విప్లవోద్యమాన్ని నడిపిన విప్లవయోధుడు.
- గొప్ప గ్రంధ రచయిత, ఆయన గ్రంథాలు ప్రచురణకు ముందే, రెండు ప్రభుత్వాలు నిషేధించాయి.
- భారత స్వాతంత్రోద్యమoలో పాల్గొన్నందుకు, విశ్వవిద్యాలయo ఆయన బారిస్టర్ డిగ్రీని రద్దు చేసింది.
- విదేశీ వస్త్రాలను బహిరంగంగా మంటల్లో కాల్చేసిన జాతీయవాది.
- దేశ సమగ్ర అభివృద్ధికై, అంటరానితనం, కులతత్వం నిర్మూలనకై పాటుపడ్డ సాంఘిక విప్లవయోధుడు.
- దేశంలో బ్రిటిష్ న్యాయవ్యవస్థకి ఎటువంటి స్థానం లేదని ఎదిరించిన విప్లవకారుడు.
- 50 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష వేయబడ్డ వ్యక్తి, దశాబ్దం పైగా జైలు శిక్ష అనుభవించి విడుదలైన తరువాత కూడా క్రియాశీలక జీవితం గడిపిన వారు.
- కాగితాలు ఇవ్వనందున, జైలు గోడలమీద కవితలు వ్రాసి, వాటిని తరువాత ప్రచురించడానికి వీలుగా, తోటి ఖైదీలను కంఠస్థం చేయమని కోరిన గొప్ప కవి.
- ఆయన జైలు శిక్ష, హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో పెద్ద సంచలం సృష్టించింది.
- ఆయన జీవితంలో తన బాధ్యతలు తీరిపోయాయనే అభిమతంతో స్వచ్ఛందంగా నిరాహారదీక్షచేసి ప్రాయోపవేశo చేసిన యోగి.
సాంఘిక విప్లవ యోధుడు
హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సావర్కర్ సాంఘిక విప్లవ యోధుడు కూడా. ధనంజయ్ కీర్ , తమ అంబేద్కర్ జీవిత చరిత్ర లో `సంస్కర్త ఉన్న స్థితి నుంచి సమాజాన్ని బాగు పరుస్తాడు, కాని విప్లవకారుడు పాత స్థితిని తొలగించి కొత్తది నిర్మిస్తాడు’ అంటారు. సావర్కర్ ఆ విధమైన సాంఘిక విప్లవయోధుడు.
శాస్త్రీయ దృక్పధం
సావర్కర్ తమ వ్యాసాలలో `నేడు’ రేపు’ `నిన్న’టికి బందీ కాకూడదని వ్రాసారు; జిజ్ఞాసతో అన్ని విశేషాలు గమనించి, విశ్లేషించి ఓక నిర్ధారణకి రావాలని చెప్తూ శాస్త్రీయ దృక్పధాన్ని నిర్వచించారు. మంచి, చెడులను అర్ధం చేసుకుని ఎంచుకోవడానికి `జాతీయ ప్రయోజనం’ `మానవ ప్రయోజనం’ కొలమానాలుగా గ్రహించాలని అన్నారు.
భారత రాజ్యాంగం అధికరణ 51A `శాస్త్రీయ దృక్పధo’, `మానవత్వం’, `జిజ్ఞాస’ `సంస్కరణ’ పౌరుల బాధ్యతగా అభివర్ణించి, సావర్కర్ ఆలోచనలను గౌరవించింది. జాతి ఔన్నత్యానికి, మానవ సంక్షేమానికి మూలoగానే కాక, `శాస్త్రీయ దృక్పధo’ ద్వారా మాత్రమే పటిష్టమైన, ఆధునిక, ప్రగతిశీల దేశాన్ని నిర్మించుకోగలమని ఆయన గాఢంగా నమ్మారు, అనేక సార్లు వ్రాసారు. ఆయన సాంఘిక పరిణామ సిద్ధాంతానికి `శాస్త్రీయ దృక్పధo’, `మానవత్వం’ సూత్రాలే ఆధారం.
కుల వ్యవస్థ
భగవద్గీతలోని 4వ చరణం `చాతుర్వర్ణ్యంమయాసృష్టం’ అనే వాక్యం, నాలుగు వర్ణాలు అని, అవి వృత్తికి సంబంధిoచినదే తప్ప, జన్మతః సమకూరేది కాదని వివరించేవారు. ఒకే `కుల’వృత్తిలో పనిచేయాలని కాని, వారసత్వoగా అదే వృత్తిలో కొనసాగాలని అర్ధం కాదని చెప్పేవారు. అన్ని కులాల మధ్య సమన్వయo సాధిస్తేనే సాంఘిక విప్లవం సాధ్యమని అన్నారు.
దేశీయ పద్ధతులు – సంకెళ్ళు
సావర్కర్ భారత దేశ దాస్య శృంఖలాలను ఎంతగా వ్యతిరేకించారో, `ఏడు సంకెళ్ళు’ అని ఆయన పేరుపెట్టిన ఈ క్రింది వాటిని కూడా అంతే తీవ్రంగా వ్యతిరేకించారు.
- కర్మకాండ, ఆచారాలు అనుసరించే సమాన హక్కులు, స్వేచ్ఛ హిందువులందరికి ఉండాలి.
- ఏ వృత్తిని ఎంచుకోవడానికైనా అందరు హిందువులకి సమాన హక్కులు, స్వేచ్ఛ ఉండాలి. కులపరమైన అంక్షలు ఏమి ఉండకూడదు, వ్యక్తులు తమకి ఇష్టమైన వృత్తిని కొనసాగించడానికి ఎవరు అడ్డు రాకూడదు.
- అస్పృశ్యత, ఏ కులం విషయంలోనైనా పూర్తిగా తొలగించాలి, అది మానవతకే శాపం. ఏ వ్యాధి కారణంగానైనా ప్రజా ఆరోగ్యానికి ముప్పు వాటిల్లితే తప్ప అంటరానితనం అనేది ఉండకూడదు.
- విదేశీ ప్రయాణాల మూలంగా వెలివేయకూడదు.
- గతంలో హిందూ మతాన్ని వదిలేసిన వారైనా, లేక ఇతర మతాలలో పుట్టిన వారైనా హిందూమతoలోకి తిరిగి రావాలనుకుంటే, వారిని ఆహ్వానించాలి. రత్నగిరిలో ఆయన స్వయంగా కొన్ని కార్యక్రమాలని నిర్వహించారు.
- మతాలలో కొన్ని రకాలైనా ఆహారాలు నిషిద్ధం అనే సూత్రాన్ని ఆయన వ్యతిరేకించారు. `మతం హృదయంలో ఉండాలి కాని, కడుపులో కాదు’ అన్నారు. రత్నగిరిలో ఆయన స్వయంగా సామూహిక భోజనాలు నిర్వహించారు.
- వివాహాలకి కులం అడ్డoకి కాకూడదు. వ్యక్తుల మంచి లక్షణాలు వివాహాలకి ఆధారం కావాలి.