Home Telugu Articles చారిత్రక హల్దీఘాట్ యుద్ధంలో రాణాప్రతాప్ కి ఆర్ధిక సహాయం చేసిన వ్యాపారవేత్త 

చారిత్రక హల్దీఘాట్ యుద్ధంలో రాణాప్రతాప్ కి ఆర్ధిక సహాయం చేసిన వ్యాపారవేత్త 

0
SHARE

రాజపుత్ర వీరుడు మహారాణా ప్రతాప్ మొమల్ చక్రవర్తి అక్బర్‌తో స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సమయం అది. అప్పటికే మహారాణా ప్రతాప్ ఈ పోరాటంలో తన సంపద మొత్తాన్ని కోల్పోయాడు. సరిగ్గా ఇదే సమయంలో తాను కష్టించి సంపాదించిన సంపదనంతా సమర్పించి, చారిత్రక హల్దీఘాట్  యుద్ధంలో  రాణాప్రతాప్ కి ఆర్ధిక సహాయం చేసిన వ్యాపారవేత్త భామాషా.. దేశం భక్తి, త్యాగాలకు ఉదాహరణగా నిలిచాడు. 

నాటి హల్దిఘాటి మహారాణా ప్రతాప్‌కు పోరాటం కొనసాగించడానికి వనరులు లేవు, సేథ్ భామాషా తన సంపద మొత్తాన్ని మహారాణాకు ఇచ్చాడు. అతని సహాయంతో మహారాణా మళ్ళీ  సైన్యాన్ని సమకూర్చుకుని, స్వాతంత్య్ర పోరాటం కొనసాగించాడు.  

భామాషా కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు.. మహారాణా ఉదయ్ సింగ్ హయాంలో ప్రధానమంత్రిగా కూడా పనిచేశాడు. అంతేకాకుండా అతని పాలనలో మేవాడ్ వ్యాపారుల అభివృద్ధి కోసం కృషి చేశాడు. ప్రస్తుతం మార్వారీలు అని పిలువబడే మేవార్ వ్యాపారులు వాణిజ్యం కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. దీని ఫలితంగా మేవార్ ఆర్థిక వ్యవస్థ బలంగా మారింది. వ్యాపారుల ప్రయాణం వల్ల రాజస్థాన్ సంస్కృతి భారతదేశం అంతటా వ్యాపించింది. 

1547 జూన్ 25న జన్మించిన భామాషా, 1600లో మరణించాడు.

Source: CIAT