Home News కరోనా టీకా పరీక్షకు సిద్ధం: విశ్వహిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి ప్రకటన 

కరోనా టీకా పరీక్షకు సిద్ధం: విశ్వహిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి ప్రకటన 

0
SHARE
ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టే వాక్సిన్ (టీకా) కనిపెట్టేందుకు వివిధ దేశాలు తీవ్రంగా పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో భారతదేశానికి చెందిన ఫార్మాసూటికల్ కంపెనీ ‘భారత్ బయోటెక్’ కోవాక్సీన్ పేరిట ఒక వాక్సిన్ అభివృద్ధి చేసింది. ఈ కోవాక్సీన్ పై క్లీనికల్ ట్రయల్స్ (మానవ శరీరంపై ప్రయోగం) జరిపేందుకు భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భారత్ బయోటెక్ సంస్థకు అనుమతి మంజూరు చేసింది.
ఈ క్రమంలో ఈ వాక్సిన్ ప్రయోగం కోసం తాను ముందుకు రావడానికి సిద్ధమని విశ్వహిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి, డాక్టర్ శ్రీ సురేందర్ జైన్ ప్రకటించారు. ఈమేరకు రోహతక్ లోని పండిట్ భగవత్ దయాళ్ శర్మ వైద్య విశ్వవిద్యాలయ  ఉపకులపతికి రాసిన లేఖలో.. మానవాళి సంక్షేమం కోసం చేపట్టిన ఈ మహత్తరమైన పరిశోధనకు తనను తాను అర్పించుకునేందుకు ముందుకు రావడానికి సిద్ధమని తెలిపారు.
శ్రీ సురేందర్ జైన్ రాసిన ఉత్తరం కాపీని విశ్వహిందూ పరిషత్ అధికారికంగా విడుదల చేస్తూ, ఆయన మానవతా దృష్టిని ప్రశంసించింది.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ బయోటెక్ ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన టీకాను పరీక్షించేందుకు ఐసిఎంఆర్  పండిట్ భగవత్ దయాళ్ శర్మ వైద్య విశ్వవిద్యాలయంతో సహా దేశంలోని 12 వైద్య విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చింది.

Source: www.organiser.org