Home News ఎస్సీ కుటుంబాలపై ముస్లిం యువకుల దాడి – జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ 

ఎస్సీ కుటుంబాలపై ముస్లిం యువకుల దాడి – జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ 

0
SHARE
షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తులపై దాడికి పాల్పడ్డ 16 మంది ముస్లిం యువకులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని అజంఘర్ జిల్లా మహారాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  అహంఘర్ ఎస్.ఎస్.పి త్రివేణి సింగ్ తెలిపిన వివరాలను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్ ప్రెస్  పత్రిక కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి:
అజంఘర్ జిల్లా సికిందర్ పూర్ ఐమా గ్రామానికి చెందిన ముస్లిం యువకులు కొందరు గతకొద్ది రోజులుగా స్థానిక బావి వద్ద  పాఠశాలకు వెళ్తున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాలికల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. బుధవారం కూడా ఆ యువకులు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో గ్రామానికి చెందిన వ్యక్తులు వారిని ప్రశ్నించారు. మరొకసారి బాలికల  అసభ్యకరంగా ప్రవర్తింరాదని కఠినంగా చెప్పారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కాసేపటికి కొందరు ముస్లిం యువకులు గుంపుగా వచ్చి ఎస్సీ కుటుంబాలపై కత్తులు, కర్రలతో దాడి చేశారని,  మహిళలపై రాళ్లు రువ్వారని పోలీసులు తెలిపారు.

సుధీర్(22) అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేయగా అతను తీవ్రంగా గాయపడ్డాడు. మరో 11 మంది పై కర్రలతో దాడి చేయగా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎస్సీ కుటుంబాలపై దాడి విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్ వెంటనే స్పందించి నిందితులపై జాతీయ భద్రతా చట్టం కింద చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశించిన కొద్ది గంటల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

అదనపు ఎస్పీ నరేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నట్టు, వారిలో ఒకరు మైనర్ గా గుర్తించినట్టు తెలిపారు. వారిని శనివారం కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ సస్పెండ్

ఎస్సీ కుటుంబాలపై ముస్లిం యువకులు చేసిన దాడి కేసులో నిర్లక్ష్యం వహించిన మహారాజా గన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరవింద్ పాండేను సస్పెండ్ చేస్తున్నట్టు అజాంఘర్ ఎస్ఎస్ పీ త్రివేణి సింగ్ మహారాజ్ తెలిపారు.