Home News శ్రద్ధాంజలి

శ్రద్ధాంజలి

0
SHARE
శ్రీ జగదేవరామ్ జీ ఓరాన్

అఖిల భారతీయ వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ అధ్యక్షులు గౌరవనీయ శ్రీ జగదేవరామ్ జీ ఓరాన్ హఠాత్ మరణం మాకు, సంఘ స్వయంసేవకులను, వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్ కార్యకర్తలందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

చిరుప్రాయంలోనే ఓరాన్ జీ కి  కళ్యాణ్ ఆశ్రమ్, సంఘ్ తో అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచి ఆఖరు శ్వాస వరకు ఆయన దేశ, సమాజ కార్యంలోనే నిమగ్నమయ్యారు. సున్నితంగా, స్నేహపూర్వకంగా మాట్లాడటం, చురుకైన బుద్ధి వల్ల ఆయన కార్యకర్తల గౌరవాదరాలను త్వరగానే పొందారు. కళ్యాణాశ్రమం పని ద్వారా ఆయన గిరిజనుల వాణి వినిపించారు. తన అపూర్వమైన కార్యశైలి ద్వారా ఆయన కళ్యాణ్ ఆశ్రమ్ కి పెద్ద దిక్కుగా మారారు.  ఆశ్రమ్ సైద్ధాంతీక భూమికను పటిష్టపరచడంతోపాటు కార్యకర్తలకు ఎప్పుడూ మార్గదర్శనం చేశారు. ఆయన హఠాన్మరణంతో కార్యకర్తలు, స్వయంసేవకులు ఆ పెద్ద దిక్కును కోల్పోయారు.

జగదేవ్ రామ్ జీ జీవితాంతం పరిశ్రమించిన, పూర్తిచేయాలని ఆకాంక్షించిన కార్యం ఇంకా మిగిలిపోయిందనే విషయాన్ని ఈ దుఃఖసమయంలో మనమంతా గుర్తించాలి. ఆ కార్యాన్ని పూర్తిచేయడానికి  కావలసిన ఓర్పు, నిష్ట, కార్యకుశలతలు ఆయన నుంచి మనకు రావాలని కోరుకుందాం.

శ్రీ జగదేవ్ రామ్ జీ ఓరాన్ ఆత్మకు సద్గతులు కలగాలని వ్యక్తిగతంగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తరఫున కూడా ప్రార్ధిస్తున్నాను.

 

మోహన్ భాగవత్,  సర్ సంఘచాలక్

సురేశ్ (భయ్యాజీ) జోషి, సర్ కార్యవాహ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్