హిందూ దేవీదేవతలను అసభ్యకరంగా చిత్రీకరిస్తూ యూట్యూబు ఛానల్లో వీడియో పోస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కురుప్పర్ కూట్టం అనే తమిళ యూట్యూబ్ ఛానల్లో తమిళులు ఎంతగానో ఆరాధించే కంద సాష్టి కవచం అనే ఆధ్యాత్మిక గ్రంధాన్ని కించపరుస్తూ యూట్యూబ్ ఛానల్లో యాంకర్ సురేంద్రన్, మరో వ్యక్తి సెంతిల్ వాసన్ ఒక వీడియో పోస్ట్ చేశారు. 15 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో పురాణాన్ని అత్యంత దారుణంగా కించ పరుస్తూ మాట్లాడారు.
ఈ స్కంద శాష్ట కవచము తమిళ హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైనది. వీడియోలో ఈ కావచంలోని ఒక మంత్రాన్ని అశ్లీలంగా మరియు అసభ్యంగా ఉపయోగించారు. దీనిపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి.
దీంతో హిందూ సంఘాల నుండి ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులు, ఇద్దరు నిందితులపై ఐపిసి 153, 153(ఏ), (1)( ఏ), 295(పి), 505(1), (బి), 505(2) కింద కేసు నమోదు చేశారు.
హిందువుల నుండి ఎదురైన తీవ్ర ఆందోళనతో దిగివచ్చిన యూట్యూబ్ యాజమాన్యం, సంబంధిత విడియో తొలగించింది. ఈ సందర్భంగా, తాము తమిళుల మనోభావాలను గౌరవిస్తున్నామని యూట్యూబ్ ఛానల్ వారు తమ ఫేస్బుక్ ఖాతా ద్వారా పేర్కొన్నారు.
కరుప్పర్ కూట్ట ఛానెల్ వేదికగా పోస్ట్చేసిన చేసిన హిందూ వ్యతిరేక వీడియోలో వ్యాఖ్యలతో తమిళనాడు హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన చేశాయి. స్వామీజీలు, మీడియా ప్రముఖులు సామాన్యులు సోషల్ మీడియా ద్వారా నిరసన వ్యక్త పరిచారు. పలువురు సినీ ప్రముఖులు కూడా కప్పురాన్ కూట్టం ఛానెల్ యొక్క చర్యలను ఖండించారు. ఇలాంటి ఛానెళ్లపై నిషేధం విధించి కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడుకు చెందిన హిందూ పరిరక్షణ సంఘం హిందూ మున్నాని రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ లకు ఫిర్యాదు చేసింది.
స్కంద శక్తి కవచాన్ని తమిళనాడులోని అన్ని వర్గాల వారు కులం, మతం, వయసు తేడా లేకుండా పారాయణం చేస్తారు. స్థానిక రైల్లో, ప్రైవేట్ వాహనాల్లో కార్యాలయానికి వెళ్ళే సమయాల్లో కూడా మహిళలు బృందాలుగా ఈ శ్లోకాలను పారాయణం చేస్తారు. చెన్నై వంటి మెట్రో పాలిటన్ నగరంలో ఎంతో భక్తితో, ఉత్సాహంగా మహిళలు శ్లోకాన్ని పారాయణం చేయడం వల్ల తమిళులు ఈ గ్రంధాన్ని ఎంతగా ఆరాధిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు.
జగద్గురు శంకరాచార్యులు కూడా తిరుచెందూర్ లోని ఆలయానికి తీర్థయాత్రకు చేరుకున్న సమయంలో కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. సుబ్రహ్మణ్య భుజంగం రాసి పారాయణం చేసి తన కడుపునొప్పి నుండి బయటపడ్డాడని సాక్షాత్తు శంకరాచార్య లే చెప్పారు.
అందుకే కవచం లేదా భుజంగం వంటి శ్లోకాలను పఠిచడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు నివారణ ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందని నమ్ముతారు.
Source : OPINDIA