తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారం గ్రామంలో హిందూ కుటుంబాలు మాత్రమే నివసించే ప్రాంతంలో కొందరు క్రైస్తవ పాస్టర్లు అనుమతులు లేకుండా అక్రమంగా చర్చి నిర్మాణం ప్రారంభించగా, ఈ నిర్మాణం చట్టవిరుద్ధమని, దీనివల్ల గ్రామంలో శాంతి వాతావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు స్థానిక గ్రామ రెవెన్యూ కార్యదర్శి నుండి జిల్లా కలెక్టర్ దాకా పలుమార్లు ఫిర్యాదులు పంపినా ఫలితం లేకపోవడంతో గ్రామస్తులు జాతీయ మానవ హక్కుల కమీషన్ (NHRC) కి ఫిర్యాదు చేసిన విషయం మనకు తెలిసినదే.
READ: అక్రమ చర్చి నిర్మాణం విషయంలో ఉదాసీనత: అధికారులపై ఎన్.హెచ్.ఆర్.సికి గ్రామస్థుల ఫిర్యాదు
దీంతో జాతీయ మానవ హక్కుల కమీషన్ గ్రామస్థుల ఫిర్యాదుపై స్పందించింది.
ఈ మేరకు కేసు రిజిస్టర్ చేసిన కమిషన్, జిల్లా కలెక్టరుకు నోటీసులు జారీ చేసింది. గ్రామస్థుల ఫిర్యాదు విషయంలో తగిన చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులను ఆదేశించాలని, 8 వారాల్లో తగు చర్యలు తీసుకుని, తీసుకున్న చర్యల వివరాలు తెలియజీయాల్సిందిగా కమిషన్ ఆదేశించింది.