Home News హైపర్ సోనిక్ వాహనాన్ని విజయవంతంగా ప్రయోగించిన భారత్ 

హైపర్ సోనిక్ వాహనాన్ని విజయవంతంగా ప్రయోగించిన భారత్ 

0
SHARE
అత్యాధునిక సాంకేతిక సాధనలో భారత్ అసాధారణ విజయం సాధించింది. అగ్రరాజ్యాలకి సొంతమైన హైపర్ శానిక్ టెక్నాలజీ(శబ్దం కంటే వేగంగా ప్రయాణించే వాహనాన్ని రూపొందించే సాంకేతిక పరిజ్ఞానం)ని ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా సొంత గానే అభివృద్ధి చేసి తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటింది.
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ)  హైపర్ సానిక్ టెస్ట్ డేమోనిస్ట్రేషన్ వెహికిల్ (HSTDV) (స్క్రామ్ జెట్) పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిశాలోని బాలాసోర్ లో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం టెస్టింగ్ రేంజ్ నుంచి ఈ వాహనం శబ్దంకంటే ఆరు రేట్ల వేగంతో దూసుకుపోయింది. అన్ని విభాగాల్లోనూ పరీక్ష విజయవంతమైందని డిఆర్డిఓ ప్రకటించింది. సాటిలైట్ ప్రయోగాలు పౌర సేవలకు కూడా ఆ టెక్నాలజీ ఉపయోగపడుతుందని తెలిపింది.
ప్రస్తుతం ఈ టెక్నాలజీ కేవలం అమెరికా, రష్యా, చైనా వద్ద ఉన్నది. ఇప్పుడు భారత్ నాలుగో దేశంగా ఈ వరుసలో నిలిచింది. డిఆర్డిఓ డైరెక్టర్ సతీష్ రెడ్డి నేతృత్వంలోని బృందం ప్రయోగాలు చేసి విజయం సాధించారు. బూస్టర్ ఆకాశంలో 30 కిలోమీటర్ల ఎత్తు చేర్చగానే ఆ తరువాత బూస్టర్ నుంచి విడిపోయి లక్ష్యం వైపు దూసుకు పోయింది. ఐదు నిమిషాల పాటు సాగిన ప్రయోగంలో సెకనుకు రెండు కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది అని డీఆర్డిఓ వెల్లడించింది.
ఈ ప్రయోగంలో  స్క్రాంజెట్, క్రూయిజ్ వాహన  పరిమితులను బహుళ ట్రాకింగ్ రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్ పరీక్షించాయి. ఇంజన్ అధిక డైనమిక్ ప్రెజర్ వద్ద, ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా పనిచేసింది.  హైపర్ సానిక్ వాహనపు క్రూయిజ్ దశలో పనితీరును బంగాళాఖాతంలో ఒక ఓడ నుంచి పరిశీలించారు.
ప్రయోగం విజయవంతం అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ  రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను, డిఆర్డి ఓ ను ప్రత్యేకంగా అభినందించారు.
ప్రయోగం లో పాల్గొన్న శాస్త్రవేత్తలను పరిశోధకులను, సిబ్బందిని  డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి కూడా
అభినందించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ కు  అధునాతన హైపర్ సానిక్ వాహనాలను ఉపయోగించేందుకు మార్గం సుగమం అయింది.
Source : PIB