దేశవ్యాప్తంగా నేత్రదానం చేసే వారి సంఖ్యను పెంచేందుకు, సక్షమ్ ఆధ్వర్యంలో కాంబా ( కార్నియా అంధత్వ ముక్త్ భారత్ అభియాన్) అనే పేరుతో నేత్ర దాన ప్రతిజ్ఞల కార్యక్రమాన్ని చేపట్టింది.
అందులో భాగంగా సక్షమ్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 4 వరకు 3 లక్షల నేత్ర దాన ప్రతిజ్ఞలు చేయించాలని లక్ష్యం నిర్ణయించుకుంది. అక్టోబర్ 8న దేశ వ్యాప్తంగా అత్యధిక ప్రతిజ్ఞలు సేకరించిన ఎన్జీవో లను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించనున్నారు.దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ కూడా అభినందించారు.
వెబ్ అప్లికేషన్ ద్వారా చేసే ఈ ప్రతిజ్ఞకు మొబైల్ లోని గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను ఉపయోగించాలని సక్షమ్ సూచించింది. చైనా బ్రౌజర్లు, చైనా కంపెనీలైన వివో, ఒప్పో, ఎమ్ఐ, రెడ్ మీ కంపెనీలో ఈ వెబ్ అప్లికేషన్ పనిచేయదని తెలిపింది.
ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పూనుకోవడానికి గల కారణం కరోనా నేపథ్యంలో నేత్ర దానం చేసే వారి సంఖ్య భారీగా తగ్గిపోవడమే. గతంలో నేత్రదానం చేసిన వారి సంఖ్య ప్రస్తుతం 10 శాతానికి పడిపోయింది. ప్రతి ఏడాది 80 లక్షల మంది మరణిస్తున్నారు. అయితే కేవలం 30 వేల మంది మాత్రమే నేత్రదానం చేస్తున్నారు. ఇది ఒక శాతం కన్నా తక్కువే. Covid 19 నేపథ్యంలో నేత్ర దానం యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి, నేత్ర దాన ప్రతిజ్ఞను చేయించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం..