Home News బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం

బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం

0
SHARE
దేశీయ పరిజ్ఞానంతో డీఅర్డీఓ రూపొందించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది. ఆదివారం  ఐఎన్ఎస్ చెన్నై నుంచి  ప్రయోగించగా అరేబియన్ సముద్రంలో ఉన్న లక్ష్యాన్ని చేదించిందని డీఆర్డీఓ ప్రకటనలో వెల్లడించింది. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో జరిపిన ప్రయోగంలో గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించింది అని పేర్కొంది.  భారత్, రష్యా సంయుక్తంగా రూపొందించిన ఈ మిస్సైల్ అత్యంత క్లిష్టమైన లక్ష్యాలను కూడా చేదిస్తుంది. ఓడలు, విమానాలు, జలాంతర్గాములు, భూమిపై నుండి ఈ బ్రహ్మస్ క్షిపణులను ప్రయోగించవచ్చు. ఇప్పటికే ఈ క్షిపణులను సైన్యం, వాయుసేన విజయవంతంగా పరీక్షించాయి.
          పరీక్ష విజయవంతం అయినందుకు డీఆర్డీఓ, బ్రహ్మోస్ ఏరోస్పేస్ శాస్త్రవేత్తలకు, భారత నావికా దళానికి  కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. మిషన్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు సిబ్బందిని డీఆర్డీఓ చైర్మన్ జి సతీష్ రెడ్డి అభినందించారు. భారతీయ సాయుధ దళాల సామర్థ్యాలకు బ్రహ్మోస్ క్షిపణులు అనేక విధాలుగా తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు.
       ఇటీవల కాలంలో భారత్ రేడియేషన్ నిషేధిత రుద్రం -1 మిస్సైల్ తో  అనేక క్షిపణులను పరీక్షించింది. చైనాతో కొనసాగుతున్న సైనిక ఘర్షణ నేపథ్యంలో 290 కిలోమీటర్ల ప్రయాణించే బ్రహ్మోస్ క్షిపణి లను భారత్ ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్, లడక్ ప్రాంతాల్లో మోహరించింది

Soure OpIndia