Home News లాక్-డౌన్ సమయంలో సేవాభార‌తి కార్య‌క్ర‌మాల సావనీర్ విడుదల 

లాక్-డౌన్ సమయంలో సేవాభార‌తి కార్య‌క్ర‌మాల సావనీర్ విడుదల 

0
SHARE

క‌రోనా నేప‌థ్యంలో విధించిన లాక్‌డౌన్ స‌మయంలో సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో స‌మాజంలో వివిధ రంగాల్లో చేసిన సేవా కార్యక్ర‌మాల వివరాలతో రూపొందించిన పుస్త‌కాన్ని రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ స‌ర్ కార్య‌వాహ మాన్య శ్రీ భ‌య్యాజీ జోషి ఆవిష్క‌రించారు. హైద‌రాబాద్‌లోని అన్నోజీగూడ శ్రీ విద్యావిహార్‌లో జ‌రిగిన ద‌క్షిణ మ‌ధ్య క్షేత్ర స‌మావేశంలో భాగంగా ఈ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. పుస్త‌కావిష్క‌ర‌ణ‌లో తెలంగాణ ప్రాంత సంఘ‌చాల‌క్ శ్రీ బూర్ల ద‌క్షిణ‌మూర్తి గారు, ప్రాంత సేవా ప్ర‌ముఖ్ శ్రీ వాసు గారు,  త‌దిత‌రులు పాల్గొన్నారు.

లాక్-డౌన్ సమయంలో సేవా భారతి కార్యక్రమాలపై ప్రముఖుల స్పందన:
“గడిచిన కొన్నేళ్లుగా సేవాభారతి యొక్క సేవా కార్యక్రమాలను మనం చూస్తూనే ఉన్నాం. ఆ సంస్థ ఇదే విధంగా పాఠశాల, కళాశాలల స్థాయిలో స్వచ్ఛంద కార్యకర్తల సహాయంతో ప్రజలకు నిష్కల్మషమైన సేవ అందించాలి. సేవా భారతి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత మంది ప్రజలకు చేరాలని ఆకాంక్షిస్తున్నాను”
– విరాట్ కోహ్లీ, భారత క్రికెట్ జట్టు సారథి. 
“సేవా భారతి అభివృద్ధికి నోచుకోని వివిధ విభాగాల్లోని ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తుండటం నేను గత 40 ఏళ్లుగా చూస్తున్నాను. ఈ కరోనా కష్టకాలంలో వివిధ సంస్థలతో కలిసి సేవాభారతి వివిధ వర్గాల ప్రజలకు చేసిన సేవ ఎంతో ప్రశంసనీయం” 
– డాక్టర్ హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి 
“ఎవరూ ఊచించనటువంటి  ఈ లాక్-డౌన్ కారణంగా దేశ ప్రజలందరూ నిస్సహాయులుగా మిగిలారు.  చేసింది. ఈ సమయంలో సేవాభారతి ఆదుకోకుంటే ఏం జరిగి ఉండేదో ఊహకు కూడా అందటంలేదు. సేవాభారతి కార్యకర్తలు ఈ కష్టకాలంలో మాకు కావాల్సిన నిత్యావసర వస్తువులు అందించి ఆకలి తీర్చడంతో పాటు మేము మా స్వస్థలాలకు చేరేదాకా కావాల్సిన సహకారం అందించారు”
– కామ్లేశ్ శర్మ, వెయిటర్, జార్ఖండ్ రాష్ట్రం 
“లాక్‌డౌన్ వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న మా లాంటి సామాన్య కుటుంబాల‌కు చెందిన ఎంతో మందికి సేవా భార‌తి కార్య‌క‌ర్త‌లు అండ‌గా నిలిచారు.  ఉపాధిలేక ఇబ్బందులు ప‌డుతున్న వారికి నెల మొత్తం స‌రిప‌డా నిత్యావ‌స‌ర స‌రుకులను అంద‌జేశారు. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో సేవా భార‌తి  అండ‌గా నిలిచి మాకు మ‌నోధైర్యాన్ని అందించారు.”
– నందాదేవి, మ‌ణిపూర్ వాసి

“క‌రోనా వ‌ల్ల మానవాళి మొత్తం తీవ్ర సంక్షోభంలో ప‌డిపోయింది. ముఖ్యంగా వ‌ల‌స కార్మికులు అనేక ఇబ్బందులు ప‌డ్డారు.  అలాంటి స‌మ‌యంలో సేవా భార‌తి కార్య‌క‌ర్త‌లు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌చ్చి సుమారు 1000 మంది వ‌ల‌స కార్మికుల‌కు ఆహార పొట్లాల‌ను అంద‌జేశారు. వారిని త‌మ త‌మ ప్రాంతాల‌కు రైలు ద్వారా చేర్చ‌డంతో మా పోలీసు శాఖకు సేవాభార‌తి కార్య‌క‌ర్త‌లు ఎంతో స‌హాయ‌ప‌డ్డారు.”
– సుధాకర్, పోలీసు అధికారి (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్), భ‌ర‌త్‌న‌గ‌ర్‌

“క‌రోనా స‌మ‌యంలో సేవాభార‌తి వంటి సంస్థ‌లు ముందుకు వ‌చ్చి వైద్య రంగంలో ముందుండి ప‌ని చేస్తున్న క‌రోనా వారియ‌ర్స్‌కు రూ. 20ల‌క్ష‌లు విలువ చేసే పిపిఈ కిట్లు, శానిటైజ‌ర్లు, హ్యండ్‌వాష్‌లు, గ్లౌజులు, ఇత‌ర వైద్య వ‌స్తువుల‌ను విరాళంగా అంద‌జేయ‌డం అభినంద‌నీయం.. సేవా భార‌తికి ధ‌న్య‌వాదాలు”
– డా. నాగేశ్వ‌ర్ రావు, వైద్య అధికారి, నిజామాబాద్ ప్ర‌భుత్వాస్పత్రి

“లాక్ డౌన్ వ‌ల్ల విద్యాసంస్థ‌లు కూడా మూసివేయ‌డంతో మా లాంటి నిరుపేద కుటుంబాల‌కు చెందిన‌ విద్యార్థులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. అలాంటి వారి కోసం సేవా భార‌తి వంటి సంస్థ‌లు, ఇత‌ర ఎన్జీవోల స‌హాకారంతో ఆన్‌లైన్ ద్వారా విద్య‌ను అందించే వేదిక‌లు ఏర్పాటు చేసి త‌ర‌గ‌తులు నిర్వ‌హించారు. దీని వ‌ల్ల అనేక మంది విద్యావేత్త‌ల నుంచి మంచి విష‌యాలు నేర్చుకోవ‌డంతో పాటు కొత్త విష‌యాలను కూడా తెలుసుకున్నాం.”
– దివ్య, విద్యార్థిని – సేవాభారతి వారి కిషోరీ వికాస్ పథకం లబ్ధిదారు