సీపీఐ(ఎం) యువజన విభాగానికి చెందిన డీవైఎఫ్ఐ నాయకుడి చేతిలో అత్యాచారానికి గురైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాలిక ఆత్యహత్య చేసుకుని మరణించిన ఘటన కేరళలోని ఇడుక్కిలోని కట్టప్పనాలో చోటు చేసుకుంది. పోలీసులు, బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… కేరళలోని ఇడుక్కి జిల్లా నరియంపరకు చెందిన సీపీఎం అనుబంధ సంస్థ డీవైఎఫ్ఐ నాయకుడు మను మనోజ్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాలికపై అక్టోబర్ 21న అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత తీవ్ర మనస్తానికి గురైన బాలిక అక్టోబర్ 23న కిరొసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 60శాతం కాలిన శరీరంతో ఆమెను కొట్టాయంలోని ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స నిమిత్తం తిరువనంతపురం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాల వల్ల పరిస్థితి విషమించి బాలిక ఈ శనివారం (31.10.2020) మృతి చెందింది.
బాలిక ఆత్మహత్యకు పాల్పిడిన తర్వాత ఆమె తల్లిదండ్రులు అక్టోబర్ 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరారీలో ఉన్న నిందుతుడిని అక్టోబర్ 24న పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. అతనిపై పొక్సో, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద అట్రాసిటి కేసు నమోదు చేశారు.
ఈ ఘటనతో నిందితుడికి అధికార CPMతో రాజకీయ సంబంధాలు బహిర్గతమవడంతో అతన్ని DYFI నుండి తొలగించారు. నిందితునికి పార్టీలో సభ్యత్వం మాత్రమే ఉందని, అతను ఏ పదవులలోనూ లేడని వారు డీవైఎఫ్ఐ నాయకులు చెబుతున్నారు.
Source : OPINDIA