Home News మ‌తం మారిన గిరిజ‌నుల ఎస్టీ హోదాను తొల‌గించాల‌ని గిరిజన సంఘాల డిమాండ్

మ‌తం మారిన గిరిజ‌నుల ఎస్టీ హోదాను తొల‌గించాల‌ని గిరిజన సంఘాల డిమాండ్

0
SHARE
చ‌త్తీస్‌గ‌డ్‌ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లపై అక్కడి గిరిజన సంఘాలు రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాయి. గిరిజన సంస్కృతీ సాంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని గత కొంతకాలంగా సాగుతున్న మతమార్పిళ్లపై ఆగ్రహంగా ఉన్న గిరిజన సంస్థలు.. తమలోని మ‌తం మారిన గిరిజ‌నుల ఎస్టీ హోదాను తొల‌గించాలంటూ రాష్ట్రపతికి వినతిపత్రాలు సమర్పించాయి. బాబా కార్తీక్ ఒరాన్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని సురాక్ష మంచ్, గిరిజన గౌరవ్ సమాజ్, జనజాతి గౌరవ్ సమాజ్ మొదలైన సంస్థ‌ల ఆధ్వర్యంలో అక్టోబ‌ర్ 29న చ‌త్తీస్‌గ‌డ్‌లోని వివిధ జిల్లాల రెవెన్యూ కేంద్రాలలో కలెక్టర్లకు తమ వినతిపత్రం సమర్పించి, రాష్ట్రపతికి చేరవేయాల్సిందిగా అభ్యర్ధించాయి.
  వినతిపత్రంతో పాటు 235 మంది లోక్‌సభ సభ్యుల సంతకం ఉన్న దరఖాస్తును కూడా కలెక్టర్లకు సమర్పించాయి. మ‌తం మారిన గిరిజ‌నుల‌కు ఎస్టీ హోదాను తొల‌గించి వారి రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేయాల‌ని గిరిజన సంఘాలు తమ మెమోరండంలో పేర్కోన్నాయి. రాష్ట్రంలోని మతమార్పిళ్ల కారణంగా నిజ‌మైన గిరిజ‌నులు ఆర్థికంగా, విద్యాపరంగా తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని  గిరిజన సంస్థల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.
     గిరిజ‌నులు మ‌తం మార‌డం వ‌ల్ల  73ఏళ్ళ స్వ‌తంత్ర్య భార‌త్‌లో నిజ‌మైన గిరిజ‌నులు నేటికి అనేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని,  ఇప్ప‌టికైనా త‌మ‌కు న్యాయం చేయాల‌ని గిరిజ‌న‌ల సంక్షేమ సంఘాలు రాష్ట్రప‌తిని, ప్ర‌ధాన‌మంత్రిని విన్న‌విస్తున్నాయి.
Source : VSK BHARATH