Home News బెంగళూరు అల్లర్లకు సంబంధించి ఎస్.డి.పి.ఐ కార్యాలయాల్లో ఎన్.ఐ.ఏ సోదాలు

బెంగళూరు అల్లర్లకు సంబంధించి ఎస్.డి.పి.ఐ కార్యాలయాల్లో ఎన్.ఐ.ఏ సోదాలు

0
SHARE
  • పట్టు బడ్డ కత్తులు, ఇనుప రాడ్లు
  • కాంగ్రెస్ నేత సంపత్ రాజ్ అరెస్ట్
ఈ ఏడాది ఆగస్టు బెంగళూరులో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి ఎస్.డి. పి. ఐ ( సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా)  పార్టీ కి సంబంధించిన నాలుగు కార్యాలయాలతో సహా పలు చోట్ల ఎన్‌.ఐ.ఏ( జాతీయ దర్యాప్తు సంస్థ) దాడులు నిర్వహించింది. బెంగుళూరు నగరాన్ని అట్టుడికించిన ఈ అల్లర్లకు సంబంధించి బెంగుళూరులోని మొత్తం 43 ప్రదేశాల్లో  దాడులు చేసినట్లు ఎన్‌.ఐ.ఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా  ఎస్. డి. పి. ఐ ( సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా),  పి.ఎఫ్. ఐ (పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కార్యాలయాల్లో చేసిన సోదాల్లో కత్తులు, ఇనుప రాడ్లు, మారణాయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 293 మందిని అరెస్టు చేశారు. ఇందులో హెచ్. జే హళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 124 మందిని అరెస్టు చేయగా మిగిలిన 169 మందిని కె.జి హళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు.
మరోవైపు ఈ కేసులో గత కొద్ది వారాలుగా పరారీలో ఉన్న కాంగ్రెస్ నేత, బెంగుళూరు మాజీ మేయర్ ఆర్ సంపత్ రాజ్ ను నవంబర్ 17న కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. అతను కొవిడ్ చికిత్స నిమిత్తం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. ఆ సమయంలో ముంద‌స్తు బెయిల్‌ దరఖాస్తు చేసుకోగా కోర్టు తిరస్కరించడంతో ఆస్పత్రి నుంచి తప్పించుకున్నాడు. దీనికి సహకరించిన అతని సహచరుడు రియాజుద్దిన్, మరొక కాంగ్రెస్ అబ్దుల్ రకిబ్ ను పోలీసులు పట్టుకుని విచారించగా పరారీలో ఉన్న సంపత్ రాజును పోలీసులు అరెస్టు చేశారు.
అల్లర్లకు సంబంధించి ఈ ఏడాది అక్టోబర్ లో కర్ణాటక పోలీసుల సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ 850 పేజీల ప్రాథమిక చార్జిషీట్ ను దాఖలు చేసింది. ఇందులో 52 మందిని నిందితులుగా పేర్కొనగా, 30 మందికి పైగా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు సేకరించింది. కాంగ్రెస్ నేతలు సంపత్ రాజ్, జాకీర్ హుస్సేన్ లు ఛార్జి షీట్ లో నిందితులుగా పేర్కొన్నారు.
Source : OPINDIA