Home News కేరళలో సిపిఎం కుల వివక్ష.. మతం మార్చుకుంటానంటున్న ఎస్సీ యువతి

కేరళలో సిపిఎం కుల వివక్ష.. మతం మార్చుకుంటానంటున్న ఎస్సీ యువతి

0
SHARE
కేరళలోని సిపిఎం ప్రభుత్వం అవలంబిస్తున్న కుల వివక్ష కు కారణంగా ఒక ఎస్సీ యువతి మతం మార్చుకోవాలని అనుకుంటోంది. వివరాల్లోకెళ్తే కేరళలోని కన్నూర్ కి చెందిన చిత్రలేఖ అనే ఎస్సీ మహిళ ఆటో డ్రైవర్ రాష్ట్రంలోని అధికార సీపీఎం చేతిలో కులవివక్ష ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇస్లాం మతంలోకి మారాలనుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె తన ఫేస్ బుక్ ఖాతా లో నవంబర్ 16న పోస్ట్ చేసింది.
అధికార సిపిఎం పార్టీ ఎస్సీ కులానికి చెందిన తనను నిరంతరం ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది. ప్రభుత్వం, కోర్టుల నుండి తనకు న్యాయం జరగదని ఆశ కోల్పోయి, కమ్యూనిస్టు పార్టీ పెట్టే ఇబ్బందులను భరించలేక చివరికి ఇస్లాం మతంలోకి మారుతున్నట్టు ప్రకటించింది. సిపిఎం కుల వివక్షకు వ్యతిరేకంగా తాను 20 సంవత్సరాలు ఒంటరిగా కష్టపడ్డానని, కపట లౌకికవాదాన్ని అవలంబించే సిపిఎం వల్ల భయంతో జీవించడం తనకు ఇష్టం లేకనే ఇలా అనుకుంటున్నట్లు ఆమె తెలిపింది.
గత ప్రభుత్వం ఆమెకు కేటాయించిన భూమిని కూడా సిపిఎం ప్రభుత్వం రద్దు చేసింది.
కేరళలోని గత యుటిఎఫ్ ప్రభుత్వం చిత్రలేఖ కు కన్నూర్ లోని కట్టంపల్లి లో కొంత భూమిని, డబ్బును కేటాయించింది. అయితే సిపిఎం ప్రభుత్వం ఆ భూమిని, డబ్బును ఆమెకు దక్కకుండా రద్దు చేసింది. ఇందుకు నిరసనగా ఆమె కలెక్టర్ కార్యాలయం ఎదుట పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. గతంలో ఒకసారి తన ఆటోను కూడా సిపిఎం కార్యకర్తలు తగలపెట్టినట్టు తెలిపింది. ఈ విధంగా అనేక రకాలుగా తాను కుల వివక్షకు గురై ఇబ్బందులు పడ్డానని తెలిపింది.
Source : OPINDIA