Home News భారత రాజ్యాంగ పరిరక్షణకు నడుంకట్టాలి

భారత రాజ్యాంగ పరిరక్షణకు నడుంకట్టాలి

0
SHARE

జాతీయ సమైక్యత, దేశ అఖండతతో పాటు స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలను ప్రవచించిన భారత రాజ్యాంగ పరిరక్షణకు నడుంకట్టాలని సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ పిలుపునిచ్చారు. ‘మనమూ, మన భారత రాజ్యాంగం’ అను పుస్తక ఆవిష్కరణ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అప్పాల ప్రసాద్ జి మాట్లాడుతూ కులాలు ఎన్నున్నా సమైక్యతతో జీవించాలని, డా బి ఆర్ అంబేద్కర్ ఆశించిన కలలు సార్థకం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. 200 గ్రామాల్లో అన్ని కులాల మధ్య సామరస్యం కోసం పనిచేసిన వివిధ వ్యక్తుల జీవితాలు, గ్రామాల్లో వివిధ అనుభవాలతో రూపొందించిన ఒక చిత్రమాలికను కూడా ఈ సంద‌ర్భంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి సామాజిక సమరసతా వేదిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. ఆకుల నరేష్ బాబు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సామాజిక సమరసతా వేదిక తెలంగాణ రాష్ట్ర మహిళా కన్వీనర్ శ్రీమతి రుక్మిణీ విచ్చేశారు. సమరసతా వేదిక సభ్యులు దొంతి రమేష్ వందన సమర్పణ చేశారు.
ఈ కార్యక్రమంలో సా.స.వే. కార్యకర్తలు అన్నబోయిన శ్రీనివాస్, సావిత్రి, రమ, డా.మల్లయ్య, రంగాచారి, దశరథ రాములు, భాస్కరరాచారి, ఏగొండ, నరేంద్ర, కటకం శ్రీనివాస్, గడ్డమీది ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.