సభ్యసమాజం తలదించుకునే విధంగా మతం మత్తులో దారుణానికి పాల్పడింది ఓ మహిళ. ‘అల్లాహ్ అనుగ్రహం’ కోసం అభంశుభం తెలియని కన్న కొడుకుని బలిచ్చింది. ఈ హృదయవిదారకర ఘటన కేరళలో చోటు చేసుకుంది. సులేమాన్, షాహిదా దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కేరళ రాష్ట్రం పాలక్కడ్‌లో నివసిస్తున్నారు. సులేమాన్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తుండగా షాహిదా ఇస్లామిక్ పాఠశాల (మదర్సా)లో బోధకురాలిగా పనిచేస్తోంది. నిత్యం ఖురాన్ బోధించే షాహిదా తీవ్రమైన మూఢనమ్ మకాలకు లోనైంది. ఈ క్రమంలో “అల్లాహ్ అనుగ్రహం కోసం” తన ఆరెండ్ల కొడుకుని బలిచ్చింది. ఇంట్లో భర్త, పిల్లలు నిద్రిస్తుండగానే తన ఆరెండ్ల కొడుకుని బాత్రూంలోకి తీసుకెళ్లి అతి కిరాతకంగా గొంతు కోసి చంపేసింది.
ఘటన అనంతరం విషయాన్ని ఆమె స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి సమాచారమివ్వడం గమనార్హం. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలాన్నిపరిశీలించారు. “అల్లాను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలోనే ఈ పని చేసాను” అని షాహిదా పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై కేసు ఐపీసీ సెక్షన్ 302 కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విశ్వనాధ్ మాట్లాడుతూ, నిందితురాలు చెప్పిన వివరాల ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన ద్వారా హత్యలో కారణాలు విశ్లేషించి నిర్ధారించగలమని తెలిపారు. ఈ ఘటనతో పాలక్కడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Source : ORGANISER