Home News విలువలు , విషయ అధ్యయనం, విశ్వసనీయత కలిగిన వాటికి మాత్రమే సోషల్ మీడియా లో ఆదరణ

విలువలు , విషయ అధ్యయనం, విశ్వసనీయత కలిగిన వాటికి మాత్రమే సోషల్ మీడియా లో ఆదరణ

0
SHARE

“సమాజంలో 80వ దశకంలో దినపత్రికలు, 90వ దశకంలో ఎలక్ట్రానిక్ మీడియా వార్తలు అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తే ప్ర‌స్తుత కాలంలో సామాజిక మాధ్యమాలే సామాజిక మార్పున‌కు దోహదం చేస్తున్నాయ‌ని, ఇందులో ప్రధానంగా విలువల ఆధారంగా, విషయ అధ్యయనం, విశ్వసనీయత కలిగిన వాటికి మాత్రమే నిరంతరం పత్రిక రంగంలో కొనసాగే అవకాశం ఉంటుందని  సీనియర్ జర్నలిస్ట్ భారత్ టుడే ఇన్ పుట్ ఎడిటర్ శ్రీ వాసుదేవ‌న్ గారు అన్నారు.

సమాచార భారతి ఆద్వర్యంలో ఆదివారం (28,మార్చి) హైదరాబాద్ లో ‘సోషల్ మీడియా సంగమం 2021’ అనే కార్యక్రమం నిర్వ‌హించారు. గత మూడు సంవత్సరాలుగా నిర్వ‌హిస్తున్న‌ ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ‘కంటెంట్ –కనెక్ట్’ అనే విషయకేంద్రంగా చేపట్టడం జరిగింది.

మొదటగా చరిత్ర సంస్కృతి అనే అంశంపై జరిగిన చర్చాగోష్టి లో మెగా మైండ్స్ వెబ్ సైట్‌ నిర్వాహకులు శ్రీ నన్నపనేని రాజశేఖర్ మాట్లాడుతూ చరిత్రలోని మహాపురుషుల విషయాలు, సంఘటనలు, స్వతంత్ర సమరంలో పాల్గొన్న వీరుల చరిత్రలను వెలికి తీసి సమాజ చైతన్యం ధ్యేయంగా వెబ్ సైట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సమాచార భారతి నుండి శ్రీ సురేందర్ మాట్లాడుతూ చరిత్ర సంస్కృతిని భారతీయ కోణంలో అందివ్వడం, దేశ చరిత్రను, మరుగున పడిన, ఉద్దేశపూర్వకంగా వెలుగులోకి రానివ్వడకుండా దాచిన అంశాలపై దృష్టి సారించి వాటిని వెలుగులోకి తీసుకొచ్చేందుకు కృషి జ‌రుగుతోంద‌న్నారు.

దాంతో పాటు, 14 భాషలలో ప్రాచుర్యం పొందిన “ఋతం – Ritam” అనే మొబైల్ యాప్ గురుంచి పరిచయం చేశారు.

‘వర్తమాన విషయాలు- భద్రత’ అనే చర్చాగోష్టిలో శ్రీ ఆశిష్ నారడి గారు మాట్లాడుతూ వారు నిర్వహిస్తున్న “ద ట్రూతీస్ట్” యూట్యూబ్ చానల్ ను  ప్రయోగాత్మకంగా వర్తమాన అంశాలను వ్యగ్యంగా పాటల రూపంలో చిత్రీకరించడం వలన విశేష ఆదరణ లభించింది అని, ప్రస్తుతం అదే కొనసాగిస్తున్నామన్నారు.

అతి తక్కువ సమయంలోని విశేష ఆదరణ పొందిన యూట్యూబ్ చానల్ “స్ట్రింగ్ రివీల్స్” సభ్యులు శ్రీ వినోద్ మాట్లాడుతూ మన దేశంలో విదేశీయుల ప్రోధ్బలంతో కొన్ని శక్తులు పని చేస్తున్నాయని, వాటిని ఛేదించడానికి తాము చేస్తున్న పరిశోధన, విశ్లేషణ పట్ల అవగాహన కల్పించారు. దాంతో పాటు ఈ లాంటి  సంచలనాత్మక అంశాల పట్ల పని చేస్తున్నపుడు కొంత ప్రతిఘటన ఎదురవుతుంది అని వారి అనుభవాలను పంచుకున్నారు.

తెలుగులో టీవీ జర్నలిజం నుండి వెబ్ జర్నలిజంలో కి ప్రవేశించిన ‘నేషనలిస్ట్ హుబ్’ స్థాపకులు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సాయికృష్ణ మాట్లాడుతూ కేవలం వ్యాపార దృక్పతం కాకుండా జాతీయవాదం, సమాజ హితం అనే లక్ష్యాల‌తో తాము పని చేస్తున్నామని తెలిపారు. దైనందిన పత్రికల్లో, టీవీ ఛానళ్ళు  సాహసించని చాలా అంశాల పట్ల నిర్భయంగా చర్చించ‌డం చాలా సంతృప్తిని ఇచ్చింద‌ని సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. దాంతో పాటు జాతీయవాదంతో పని చేస్తున్న సంస్థలు కలిసికట్టు గా పనిచేయాలని ఈ సంద‌ర్భంగా ఆయ‌న కోరారు.

75 సం. స్వతంత్ర ఉత్సవాల పట్ల శ్రీ అమర్నాథ్ మాట్లాడుతూ  వాస్కోడిగామ మన దేశంలో అడుగుపెట్టిన నాటి నుండి బ్రిటిష్ వారు దేశం వదిలి వెళ్ళే వరకు స్వతంత్రం పోరాటాన్ని వెలికితీసి ఈ తరానికి అంధించాలని కోరారు.

సమాచార భారతి కార్యదర్శి శ్రీ అయూష్ మాట్లాడుతూ ప్రస్తుతం తరుణంలో సోషల్ మీడియా ను సమాజ హితం, జాతీయ వాదాన్ని ప్రచారం చేయడానికి ఒక సాధనంగా, స‌ర‌లాత్మక ఆలోచనతో ఉపయోగించడం అనేది అత్యంత ఆవశ్యకం అని దానిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సమాచార భారతి సభ్యులు శ్రీ ప్రదీప్, శ్రీ రాంనరేశ్, శ్రీ బిక్షపతి,  శ్రీ విక్రాంత్, శ్రీ సహదేవ్, శ్రీ సంతోష్, శైలజ గారు, శ్రీ శ్రీనివాస్, శ్రీ అమిత్ కుమార్, తో పాటు రాష్ట్రంలో లోని వివిధ జిల్లాల నుండి వెబ్ సైట్ , యు ట్యూబ్‌ చానల్ నిర్వాహకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.