ఉత్తర ప్రదేశ్‌లో మరో పూజారి హత్యకు గురయ్యాడు. బులంద్‌షహర్‌లోని ఒక ఆలయానికి సమీపంలో ఉన్న పొలంలో ఆలయ పూజారి సోమవారం ఉదయం హిందూ పూజారి మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే అశోక్ కుమార్ (50) అనే పూజారి సాలెంపూర్ లోని కైలావన్ గ్రామం నుండి వారం రోజుల క్రితం ఆలయంలో పనికి వచ్చారు. సోమవారం ఉదయం షికార్‌పూర్‌లోని ఆంచ్రూ కాలా గ్రామంలోని ప్రసిద్ధ ధక్వాలే ఆలయానికి సమీపంలో ఉన్న పొలంలో పూజారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
సమాచారం అందుకున్న సిఐ బిజేంద్ర రాస్తోగి, పోలీసు అధికారి సుభాష్ సింగ్ ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పదునైన ఆయుధాన్ని ఉపయోగించి పూజారి గొంతు కోసినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించిన ప్రతి అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఎస్.ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. పూజారిని దారుణంగా హత్య చేసినందుకు ఆవేదనకు గురైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాధువులపై వరుస దాడులు :
కాంగ్రెస్ పాలిత ఛత్తీస్ గడ్ లోని బిలాస్‌పూర్‌కు వచ్చిన నాగా సాధును సోమవారం (మార్చి 22) పోలీసులు దారుణంగా దాడి చేశారు. పోలీసులు అతన్ని దారుణంగా కొట్టడమే కాకుండా అతని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.1.25లక్షల నగదు, రూ.12వేల ఫోన్ ఉన్నాయి. అనంతరం సాదువును పోలీసు స్టేషన్ నుంచి తరిమేశారు.
యూపీ వార్త న్యూస్ అనే మీడియా సంస్థ నివేదిక ప్రకారం యూపీలోని ఇస్లాం నగర్‌లో ఒక సాధు తలను బలమైన వస్తువుతో పగులగొట్టి, అతని శరీరానికి నిప్పంటించి దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు.
వారం రోజుల క్రితం ఫిరోజాబాద్‌లో మహంత జయశ్రీ బాబాపై కొంత మంది కత్తులతో దాడి చేసి, ఆయన వద్ద ఉన్న రూ.లక్ష దోచుకున్నట్టు అమర్ ఉజాలా వార్త సంస్థ నివేదించింది. ఆశ్రమం, గోశాల నిర్మాణ పనుల కోసం ఆ డబ్బు సాధువు వద్ద ఉంది.
2020లో హిందూ సాధువులపై 11 దారుణ దాడులు వెలుగులోకి వచ్చాయి. ఇంత మంది హిందూ సాదువులపై దాడులు జరుగుతున్నా కొన్ని ప్రధాన మీడియా సంస్థలు ప్రసారం చేయకపోవడం, కొన్ని కుహానా లౌకికవాద రాజకీయ పార్టీలు స్పందించకోవడం గమనార్హం.
SOURCE : OP INDIA